సరూర్ నగర్, గంగారంలో వైభవంగా వినాయక నిమజ్జనం..

ABN, Publish Date - Sep 20 , 2026 | 09:02 PM

గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు.

సరూర్ నగర్, గంగారంలో వైభవంగా వినాయక నిమజ్జనం.. 1/8

గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.

సరూర్ నగర్, గంగారంలో వైభవంగా వినాయక నిమజ్జనం.. 2/8

వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు.

సరూర్ నగర్, గంగారంలో వైభవంగా వినాయక నిమజ్జనం.. 3/8

డప్పులు, బ్యాండ్ మేళాలు, గణపతి బప్పా మోరియా అంటూ భక్తుల నినాదాలతో గంగారం, సరూర్‌నగర్ చెరువుల్లో వైభవంగా వినాయక నిమజ్జనం జరిగింది.

సరూర్ నగర్, గంగారంలో వైభవంగా వినాయక నిమజ్జనం.. 4/8

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా భక్తులు ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సరూర్ నగర్, గంగారంలో వైభవంగా వినాయక నిమజ్జనం.. 5/8

అలాగే గణపతి పందిళ్లలో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. దీంతో పలు పందిళ్లలో భక్తుల సందడి నెలకొంది.

సరూర్ నగర్, గంగారంలో వైభవంగా వినాయక నిమజ్జనం.. 6/8

నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.

సరూర్ నగర్, గంగారంలో వైభవంగా వినాయక నిమజ్జనం.. 7/8

ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్లు, లైటింగ్, తాగునీరుతోపాటు భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

సరూర్ నగర్, గంగారంలో వైభవంగా వినాయక నిమజ్జనం.. 8/8

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జన ప్రాంతంలో ప్రత్యేక నిఘా కొనసాగించారు.

Updated at - Sep 20 , 2026 | 09:10 PM