గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా హైదరాబాద్: సీఎం రేవంత్
ABN, Publish Date - Feb 17 , 2026 | 02:05 PM
గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా హైదరాబాద్ నిలుస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ బయో ఆసియా సదస్సు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాగా అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హైటెక్స్ వేదికగా నిర్వహించిన బయో ఆసియా సదస్సును సోమవారం సీఎం రేవంత్ ప్రారంభించారు.
1/9
గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా హైదరాబాద్ నిలుస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
2/9
ఈ బయో ఆసియా సదస్సు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాగా అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందనే నమ్మకం ఉందన్నారు.
3/9
హైటెక్స్ వేదికగా నిర్వహించిన బయో ఆసియా సదస్సును సోమవారం ఆయన ప్రారంభించారు.
4/9
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఫార్మా, సాఫ్ట్‌వేర్‌తో పాటు మరిన్ని కీలక రంగాలకు హైదరాబాద్ ప్రసిద్ధి చెందిందని గుర్తు చేశారు.
5/9
నగరంలో మానవ వనరులు, ప్రముఖ విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయన్నారు. ముందస్తు విజన్, పాలసీలతో ప్రభుత్వం సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
6/9
మంగళవారం ప్రారంభమైన ఈ సదస్సు.. బుధవారంతో ముగియనుంది.
7/9
జీవశాస్త్రంలో వస్తున్న మార్పులు, లైఫ్ సైన్సెస్ రంగంలో నిరంతర వృద్ధిని సాధించడమే లక్ష్యంగా ఈ సదస్సులో కీలక చర్చలు జరపనున్నారు.
8/9
ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ సమ్మేళనంగా బయో ఆసియా సదస్సు ప్రత్యేక గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.
9/9
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 వేల మంది ప్రతినిధులతోపాటు 500 కంపెనీలు ఈ బయో ఆసియా సదస్సులో పాల్గొన్నాయి.
Updated at - Feb 17 , 2026 | 02:11 PM