సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. హాజరైన గవర్నర్
ABN, Publish Date - Jan 26 , 2026 | 06:51 PM
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
1/19
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎగరవేశారు.
2/19
అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
3/19
రిపబ్లిక్ డే వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు.
4/19
అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
5/19
ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.
6/19
అమెరికా పర్యటనలో ఉండటంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరుకాలేదు.
7/19
సీఎం రేవంత్ రెడ్డి రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా సందేశమిచ్చారు.
8/19
భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత అని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్యానించారు.
9/19
ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిందని.. ఈ డాక్యుమెంట్ హైదరాబాద్ ఇమేజ్‌ను మరింత పెంచుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు.
10/19
రాష్ట్రాన్ని మూడు ఎకనమిక్ జోన్లుగా విభజించి, కీలక రంగాలకు ప్రత్యేకమైన జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.
11/19
మేడారం అభివృద్ధి కోసం రూ.251కోట్లు కేటాయించినట్లు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడించారు.
12/19
రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, గతేడాది బతుకమ్మ వేడుకలు గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు.
13/19
26 లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు, ధాన్యానికి బోనస్‌గా రైతులకు రూ.1,780కోట్లు అందజేశామని గవర్నర్ వెల్లడించారు.
14/19
ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.
15/19
భూ వివాదాలను పరిష్కరించేందుకు భూభారతి చట్టం తీసుకొచ్చామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్యానించారు.
16/19
గ్రూప్-1, 2, 3 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, ఇప్పటివరకు 62 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.
17/19
ఐటీఐలను అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్లుగా మార్చి, తెలంగాణను గ్లోబల్ స్కిల్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు.
18/19
విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడించారు.
19/19
మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.
Updated at - Jan 26 , 2026 | 07:13 PM