పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతిలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Oct 23 , 2026 | 01:53 PM

హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురువారం నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతిలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతిలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 1/9

హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురువారం నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతిలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతిలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 2/9

కొడంగల్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ముదిరాజులేనని.. వారు విశ్వాసనీయమైన వారని కొనియాడారు. భూస్వాములు పేదల భూములను ఆక్రమిస్తే పండుగ సాయన్న ఎదురుతిరిగారని చెప్పారు.

పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతిలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 3/9

పండుగ సాయన్నను అన్యాయంగా హత్య చేశారని.. ఆయన చనిపోయి వందేళ్లు దాటినా నేటికీ నాట్లు, కోతల సమయంలో పండుగ సాయన్న పాటలు వినిపిస్తున్నాయని తెలిపారు.

పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతిలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 4/9

నాడు ఎన్టీఆర్ హయాంలో రూ.2లకు కిలో బియ్యం ఇస్తే.. తాము ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 3.48 కోట్ల మందికి నేడు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.

పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతిలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 5/9

నిజాం హయాంలో దొరలు.. పేదల భూములను ఆక్రమిస్తుంటే వారికి అండగా పండుగ సాయన్న నిలిచారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. దొరలకు వ్యతిరేకంగా తాను ఓ దళాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.

పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతిలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 6/9

సాయన్న ప్రజలకు ధాన్యం పంచడమే కాదని, పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయనను నిజాం పోలీసులు అరెస్టు చేస్తే నాటి వనపర్తి మహారాణి పెద్దఎత్తున నిధులు చెల్లించి విడిపించారని తెలిపారు.

పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతిలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 7/9

బ్రిటిష్ హయాంలో కులగణన చేశారని.. వందేళ్ల తర్వాత తమ ప్రభుత్వం కులగణన చేపట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. కులగణన చేసినందుకనే ఈ రోజు బలంగా ప్రతి కులం.. తమ గళం వినిపిస్తోందని అన్నారు.

పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతిలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 8/9

ఎవరైనా కులగణనలో తమ జనాభా తక్కువగా ఉందని భావిస్తే పూర్తి వివరాలిస్తే లెక్కలను సవరిస్తామని చెప్పారు. లెక్కలు లేనందునే ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ కు మార్చలేకపోయారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతిలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 9/9

ఈ అంశంపై వచ్చే క్యాబినెట్ భేటీలో చర్చిస్తామని మాటిచ్చారు. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి, పూర్తిస్థాయిలో అధ్యయనం చేయిస్తామని వెల్లడించారు. ఈ అంశంపై ఇతర కులాలకు ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాల్సి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated at - Oct 23 , 2026 | 02:07 PM