బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి హాజరైన చంద్రబాబు, రేవంత్
ABN, Publish Date - Aug 16 , 2026 | 05:16 PM
హైదరాబాద్‌లో ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహ వేడుక ఘనంగా జరిగింది. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ వివాహ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు. అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
1/10
హైదరాబాద్‌లో ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహ వేడుక ఘనంగా జరిగింది.
2/10
జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ వివాహ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు.
3/10
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
4/10
వివాహ వేడుకలో పాల్గొన్న చంద్రబాబు, భువనేశ్వరి.. నూతన వధూవరులు జనని, సూర్యతేజలను ఆశీర్వదించారు.
5/10
నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
6/10
సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముకులు, బంధువులు, సన్నిహితులు ఈ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
7/10
నూతన వధూవరులు జనని, సూర్యతేజలను సీఎం రేవంత్‌రెడ్డి ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
8/10
నూతన వధూవరులు జనని, సూర్యతేజలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆశీర్వదించారు.
9/10
పలువురు ప్రముకుల రాకతో ఈ వివాహ వేడుకకు మరింత ప్రత్యేకత సంతరించుకుంది.
10/10
నూతన వధూవరులు జనని, సూర్యతేజలను టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆశీర్వదించారు.
Updated at - Aug 16 , 2026 | 05:23 PM