ఘనంగా బసవతారకం ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు
ABN, Publish Date - Apr 11 , 2026 | 12:33 PM
వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తన ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుంది. ఆస్పత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ (రజతోత్సవ) వేడుకలను పురస్కరించుకుని, అత్యంత ప్రమాదకరమైన అన్నవాహిక క్యాన్సర్‌పై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును మాదాపూర్‌లోని 'ది వెస్టిన్' హోటల్‌లో ఘనంగా నిర్వహించారు.
1/7
వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తన ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుంది.
2/7
ఆస్పత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ (రజతోత్సవ) వేడుకలను పురస్కరించుకుని, అత్యంత ప్రమాదకరమైన అన్నవాహిక క్యాన్సర్‌పై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును మాదాపూర్‌లోని 'ది వెస్టిన్' హోటల్‌లో ఘనంగా నిర్వహించారు.
3/7
ఈ సదస్సును ప్రముఖ నటుడు, టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
4/7
ఈ కార్యక్రమ ప్రారంభంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. క్యాన్సర్ అవగాహన, ముందస్తు పరీక్షల ప్రాధాన్యం, ఆధునిక వైద్య సదుపాయాల అవసరాన్ని ప్రస్తావించారు. ఆరోగ్య రంగ అభివృద్ధిలో ఇలాంటి అంతర్జాతీయ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు.
5/7
ఈ అంతర్జాతీయ సదస్సును ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ డిసీజెస్ ఆఫ్ ది ఈసోఫాగస్ (ISDE), బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
6/7
ఈ కార్యక్రమం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ (25 సంవత్సరాలు) వేడుకల్లో భాగంగా నిర్వహించారు.
7/7
ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా 150 మందికి పైగా ఆంకాలజీ నిపుణులు పాల్గొన్నారు. కెనడా, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల నుంచి ప్రముఖ వైద్య నిపుణులు హాజరై తమ పరిశోధనలు, చికిత్సా విధానాలు, తాజా వైద్య సాంకేతికతలపై చర్చించారు.
Updated at - Apr 11 , 2026 | 12:36 PM