హైదరాబాద్‌లో హెచ్‌ఐవీ అవగాహన మానవహారం

ABN, Publish Date - Apr 09 , 2026 | 11:33 AM

హెచ్‌ఐవీపై అవగాహన కల్పిస్తూ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు(గురువారం) మాదాపూర్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై మానవహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడారు.

హైదరాబాద్‌లో హెచ్‌ఐవీ అవగాహన మానవహారం 1/10

హెచ్‌ఐవీపై అవగాహన కల్పిస్తూ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు(గురువారం) మాదాపూర్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై మానవహారం కార్యక్రమం నిర్వహించారు.

హైదరాబాద్‌లో హెచ్‌ఐవీ అవగాహన మానవహారం 2/10

ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడారు.

హైదరాబాద్‌లో హెచ్‌ఐవీ అవగాహన మానవహారం 3/10

సమాజంలో ఎయిడ్స్‌ నివారణపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ రోజు(గురువారం) రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, మానవ హారాలు, మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో హెచ్‌ఐవీ అవగాహన మానవహారం 4/10

హెచ్‌ఐవీ అనేది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరచే వైరస్ అని తెలిపారు. చికిత్స తీసుకోకుండా ఉంటే అది ఎయిడ్స్‌గా మారుతుందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో హెచ్‌ఐవీ అవగాహన మానవహారం 5/10

రక్షణలేని లైంగిక సంబంధాలు, కలుషిత రక్త మార్పిడి‌ తదితర కారణాలతో హెచ్‌ఐవీ వ్యాపిస్తుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పుకొచ్చారు.షేక్ హ్యాండ్, ఆలింగనం, కలిసి భోజనం చేయడం వంటి సాధారణ పరిచయాల ద్వారా హెచ్‌ఐవీ వ్యాపించదని అన్నారు.

హైదరాబాద్‌లో హెచ్‌ఐవీ అవగాహన మానవహారం 6/10

అవగాహన లేకపోవడం వల్లే భయాలు, అపోహలు, వివక్ష పెరుగుతున్నాయని చెప్పారు. హెచ్‌ఐవీ బాధితులను సామాజికంగా ఇబ్బంది పెట్టడం‌ సరికాదని... వారికి కూడా గౌరవం, సహాయం, సమాన హక్కులు కల్పించాలని సూచించారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ (నివారణ, నియంత్రణ) చట్టం 2017 ప్రకారం, వివక్ష చూపడం చట్టరీత్యా నేరమని అన్నారు.

హైదరాబాద్‌లో హెచ్‌ఐవీ అవగాహన మానవహారం 7/10

ఒక్కప్పుడు హెచ్‌ఐవీ ప్రాణాంతక వ్యాధి.. కానీ, ఇప్పుడు ప్రాణాంతక వ్యాధి కాదని తెలిపారు. సమయానికి పరీక్షలు, సరైన చికిత్స తీసుకుంటే నాలుగైదు దశాబ్దాలు కూడా సాధారణ జీవితాన్ని గడపవచ్చని చెప్పారు.

హైదరాబాద్‌లో హెచ్‌ఐవీ అవగాహన మానవహారం 8/10

ఎయిడ్స్ నివారణ కోసం తమ ప్రభుత్వం ఉచితంగా టెస్టులు, చికిత్స, మందులు అందిస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 127 టెస్టింగ్ సెంటర్లు, 33 ART సెంటర్ల ద్వారా 1.14 లక్షల మంది పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు.

హైదరాబాద్‌లో హెచ్‌ఐవీ అవగాహన మానవహారం 9/10

ముఖ్యంగా యువతకు ఒక సూచన సెడెంటరీ లైఫ్ స్టైల్_ అనారోగ్యకర అలవాట్లతో జీవితాన్ని పాడు చేసుకోవద్దని సూచించారు. ఆరోగ్యంగా లేకుంటే ఎంత మంచి సంపాదన ఉన్నా.. వృథానే అని మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు.

హైదరాబాద్‌లో హెచ్‌ఐవీ అవగాహన మానవహారం 10/10

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని.. డ్రగ్స్‌ చాలా ప్రమాదకరమని అన్నారు. మరీ ముఖ్యంగా ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకోవడం వల్ల హెచ్‌ఐవీ, ఇతర రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పుకొచ్చారు.

Updated at - Apr 09 , 2026 | 11:37 AM