మలేషియాలో ప్రధాని మోదీ విస్తృత పర్యటన
ABN, Publish Date - Feb 09 , 2026 | 06:48 AM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మలేషియాలో రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మలేషియా ప్రధాని ఇబ్రహీంతో చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ అంశాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. పలు కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.
1/18
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మలేషియాలో రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
2/18
ఈ నేపథ్యంలో మలేషియా ప్రధాని ఇబ్రహీంతో చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ అంశాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. పలు కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.
3/18
భారతదేశం, మలేషియా మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు మరో కీలక మలుపు తిరిగాయి. సెరి పెర్దానాలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో మోదీ సమావేశం అయ్యారు. ఈ భేటీ రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలపరిచే దిశగా సాగింది.
4/18
వాణిజ్యం నుంచి అత్యాధునిక సాంకేతికతల వరకు, భద్రత నుంచి బయోటెక్నాలజీ వరకు విస్తృత అంశాలపై ఇరు దేశాల ప్రధానుల మధ్య సమగ్ర చర్చలు జరిగాయి.
5/18
భారతదేశం, మలేషియా భౌగోళికంగా మాత్రమే కాకుండా, చరిత్రపరంగా కూడా సన్నిహిత మిత్రదేశాలు. శతాబ్దాలుగా వ్యాపారం, సంస్కృతి, మతం, ప్రజల మధ్య సంబంధాలు ఈ రెండు దేశాలను అనుసంధానిస్తున్నాయి.
6/18
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, శాంతి, అభివృద్ధి లక్ష్యంగా ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి.
7/18
మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం అధికారిక నివాసమైన సెరి పెర్దానాలో జరిగిన ఈ భేటీ అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగింది. ఇరు దేశాల ప్రధానులు పరస్పర గౌరవంతో, స్నేహపూర్వకంగా చర్చలు జరిపారు.
8/18
ఈ సమావేశంలో గతంలో సాధించిన పురోగతిని సమీక్షించడమే కాకుండా, భవిష్యత్తు సహకారానికి స్పష్టమైన దిశను నిర్ణయించారు.
9/18
ఈ ఉన్నత స్థాయి భేటీలో ఉభయ దేశాల ప్రయోజనాల కోసం పలు కీలక రంగాలపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా అభివృద్ధి, సాంకేతికతపై ఇరు దేశాల ప్రధానులు దృష్టి సారించారు.
10/18
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఏఐ, డిజిటల్ టెక్నాలజీలు, సెమీకండక్టర్ల తయారీలో పరస్పర సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి.
11/18
ఈ చర్చల అనంతరం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాద నిరోధం, నిఘా సమాచారాన్ని పంచుకోవడం, సముద్ర భద్రత తదితర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేస్తామని, అదే సమయంలో రక్షణ సహకారాన్ని మరింత విస్తరిస్తామని తెలిపారు.
12/18
భారతీయ మూలాలున్న జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం మలేషియా అని తెలిపారు. రెండు దేశాల ప్రజల మధ్య గాఢమైన, ఆప్యాయతతో కూడిన సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
13/18
తమిళ భాషపై ఉన్న ఉమ్మడి ప్రేమ ఇరు దేశాలనూ కలుపుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మరోవైపు, ద్వైపాక్షిక లావాదేవీల్లో సాధ్యమైనంత వరకూ స్థానిక కరెన్సీలను ఉపయోగించాలనే భారత నిర్ణయాన్ని అన్వర్ స్వాగతించారు.
14/18
ఉగ్రవాదం విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉంది. ఇందులో ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదు. రాజీపడే ప్రసక్తే లేదు’’ అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
15/18
శాంతి కోసం చేసే అన్ని ప్రయత్నాలకు భారత్ నిరంతరం మద్దతిస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
16/18
ఉగ్రవాద నిరోధం, నిఘా సమాచారాన్ని పంచుకోవడం, సముద్ర భద్రత తదితర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేస్తామని, అదే సమయంలో రక్షణ సహకారాన్ని మరింత విస్తరిస్తామని ప్రధాని మోదీ తెలిపారు.
17/18
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కృత్రిమ మేధస్సు, డిజిటల్ టెక్నాలజీలు, ఆరోగ్య సంరక్షణ, జాతీయ భద్రత, సెమీకండక్టర్లు, వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.
18/18
మలేషియాతో భారత్‌కు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. భారతీయ మూలాలున్న జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం మలేషియా అని ప్రధాని మోదీ తెలిపారు.
Updated at - Feb 09 , 2026 | 07:52 AM