ప్రధాని మోదీతో రామ్మోహన్‌ కుటుంబం ఆత్మీయ భేటీ

ABN, Publish Date - May 24 , 2026 | 06:59 AM

కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని శనివారం ఢిల్లీ లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో కలిశారు. మోదీని కలిసిన సందర్భంగా రామ్మోహన్‌ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తన అమ్మ, భార్య, పిల్లలతో కలిసి మర్యాదపూర్వకంగా ప్రధానితో భేటీ అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన అమ్మ.. మోదీకి ఓ మొక్కను బహూకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నారు.

ప్రధాని మోదీతో రామ్మోహన్‌ కుటుంబం ఆత్మీయ భేటీ 1/5

కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని శనివారం ఢిల్లీ లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో కలిశారు.

ప్రధాని మోదీతో రామ్మోహన్‌ కుటుంబం ఆత్మీయ భేటీ 2/5

మోదీని కలిసిన సందర్భంగా రామ్మోహన్‌ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తన అమ్మ, భార్య, పిల్లలతో కలిసి మర్యాదపూర్వకంగా ప్రధానితో భేటీ అయినట్లు తెలిపారు.

ప్రధాని మోదీతో రామ్మోహన్‌ కుటుంబం ఆత్మీయ భేటీ 3/5

ప్రధాని చూపిన ప్రేమ, ఆప్యాయత, ఆశీస్సులకు తామెప్పటికీ కృతజ్ఞులమేనని వ్యాఖ్యానించారు. తమతో గడిపిన అమూల్యమైన సమయానికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలని రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. ఈ భేటీ తమ కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే ఓ భావోద్వేగ క్షణమని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీతో రామ్మోహన్‌ కుటుంబం ఆత్మీయ భేటీ 4/5

ఈ సందర్భంగా తన అమ్మ.. మోదీకి ఓ మొక్కను బహూకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

ప్రధాని మోదీతో రామ్మోహన్‌ కుటుంబం ఆత్మీయ భేటీ 5/5

ప్రధానిని కుటుంబ సమేతంగా కలిసే అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా, గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రధాని మోదీ అసాధారణ వ్యక్తిత్వం, ఆప్యాయత తమ కుటుంబంలోని మూడు తరాలను ఆకట్టుకుందని పేర్కొన్నారు. ప్రజల హృదయాల్లో ప్రధాని ఎందుకు అపారమైన ఆదరణ పొందారో ఆ క్షణంలో మరింత స్పష్టంగా తెలిసిందని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.

Updated at - May 24 , 2026 | 07:06 AM