ఢిల్లీ కర్తవ్యపథ్‌లో వందేమాతరం థీమ్‌తో గణతంత్ర వేడుకలు
ABN, Publish Date - Jan 26 , 2026 | 05:04 PM
నేడు జరిగిన 77వ గణతంత్ర వేడుకలు భారతదేశ ఘనతను, సైనిక పటిమను ప్రపంచానికి చాటాయి. ఈ ఏడాది గణతంత్ర వేడుకలు '150 ఏళ్ల వందేమాతరం' అనే ప్రత్యేక థీమ్‌తో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 1876లో బంకిం చంద్ర ఛటర్జీ ఈ గేయాన్ని రచించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ థీమ్‌ను ఎంచుకున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో అంగరంగ వైభవంగా ఈ వేడుకలను నిర్వహించారు.
1/21
నేడు దేశవ్యాప్తంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ (2026) వేడుకలు భారతదేశ ఘనతను, సైనిక పటిమను ప్రపంచానికి చాటాయి.
2/21
ఈ ఏడాది గణతంత్ర వేడుకలు "150 ఏళ్ల వందేమాతరం" అనే ప్రత్యేక థీమ్‌తో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
3/21
1876లో బంకిం చంద్ర ఛటర్జీ ఈ గేయాన్ని రచించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ థీమ్‌ను ఎంచుకున్నారు.
4/21
గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు.
5/21
కర్తవ్యపథ్‌లో జాతీయ జెండా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు, ఇద్దరు ఐరోపా ప్రముఖులు హాజరయ్యారు.
6/21
ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు.
7/21
మొత్తం 6,050 మంది సైనికులతో పరేడ్ ఆసక్తికరంగా సాగింది. తొలిసారిగా 'భైరవ లైట్ కమాండో బెటాలియన్' పరేడ్‌లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
8/21
ఇది ఇన్‌ఫాంట్రీ, స్పెషల్ ఫోర్సెస్ మధ్య వారధిగా పనిచేస్తుంది. భారత్‌తో పాటు ఐరోపా సమాఖ్యకు చెందిన సైనిక బృందం కూడా ఈ పరేడ్‌లో పాల్గొనడం విశేషం.
9/21
గణతంత్ర వేడుకలో మొత్తం 30 శకటాలు ప్రదర్శించారు.
10/21
ఇందులో 17 రాష్ట్రాలు, 13 కేంద్ర మంత్రిత్వ శాఖల శకటాలు ఉన్నాయి.
11/21
అయితే, ఈసారి రొటేషన్ పాలసీ కారణంగా తెలుగు రాష్ట్రాల (ఏపీ, తెలంగాణ) శకటాలకు చోటు దక్కలేదు.
12/21
4MI-17 హెలికాప్టర్లు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించాయి.
13/21
ఫ్లైపాస్ట్‌లో రఫెల్, సుఖోయ్-30, మిగ్-29 వంటి 16 యుద్ధ విమానాలు, 9 హెలికాప్టర్లు పాల్గొని సాహసోపేతమైన విన్యాసాలు చేశాయి.
14/21
త్రివిధ దళాలు సంయుక్తంగా 'ఆపరేషన్ సిందూర్' ఆయుధ వ్యవస్థను ప్రదర్శించి దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటిచెప్పాయి.
15/21
ఢిల్లీ వ్యాప్తంగా 30 వేల మంది పోలీసులతో ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజలతో పాటు సుమారు 10 వేల మంది ప్రత్యేక ఆహ్వానితులు (వివిధ రంగాల ప్రముఖులు, సామాన్యులు) ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు.
16/21
ఈసారి పరేడ్ గ్యాలరీలకు వీవీఐపీ లేబుల్స్ కాకుండా భారతీయ నదుల పేర్లు పెట్టడం మరో ప్రత్యేకత.
17/21
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధాని మోదీ అన్నట్లుగా ఈ వేడుకలు కేవలం ఉత్సవం మాత్రమే కాదని.. 'వికసిత్ భారత్' నిర్మాణానికి మనమంతా చేసే ప్రతిజ్ఞకు ఒక సంకేతమని వ్యాఖ్యానించారు.
18/21
దేశ ప్రజలకు ప్రధాని మోదీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.
19/21
దేశ గౌరవం, గర్వం, కీర్తికి ప్రతీక జాతీయ పండుగ అని అభివర్ణించారు.
20/21
ప్రజల జీవితాల్లో కొత్త శక్తి, ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది పరేడ్‌లో మొదటిసారిగా పాల్గొన్న బాక్ట్రియన్ ఒంటెలు, మిలిటరీ డాగ్ స్క్వాడ్ విన్యాసాలు అబ్బురపరిచాయి.
21/21
వికసిత్ భారత్ నిర్మాణానికి సమష్టిగా ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Updated at - Jan 26 , 2026 | 05:09 PM