బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ

ABN, Publish Date - Nov 14 , 2026 | 06:49 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో పింక్ లైన్‌ మెట్రోను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. కర్ణాటక సీఎం డీకే శివ‌కుమార్‌‌తో కలిసి ఆయన మెట్రో ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తావరెకెరె మెట్రో స్టేషన్‌లో మోదీ, డీకే శివకుమార్ పచ్చజెండా ఊపడంతో ఈ పింక్ లైన్ ప్రారంభమైంది. ఆ తర్వాత తావరెకెరె నుంచి ఐఐఎంబీ వరకు ఇరువురు నాయకులూ మెట్రోలోనే ప్రయాణించారు.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 1/21

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో పింక్ లైన్‌ మెట్రోను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 2/21

కర్ణాటక సీఎం డీకే శివ‌కుమార్‌‌తో కలిసి ఆయన మెట్రో ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 3/21

తావరెకెరె మెట్రో స్టేషన్‌లో మోదీ, డీకే శివకుమార్ పచ్చజెండా ఊపడంతో ఈ పింక్ లైన్ ప్రారంభమైంది.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 4/21

ఆ తర్వాత తావరెకెరె నుంచి ఐఐఎంబీ వరకు ఇరువురు నాయకులూ మెట్రోలోనే ప్రయాణించారు.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 5/21

బెంగళూరు మెట్రో చరిత్రలో పింక్ లైన్ మరో కీలక మైలురాయిగా మారనుంది.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 6/21

బెంగళూరులో మెట్రో నెట్‌వర్క్103.6 కిలోమీటర్లకు చేరింది. తొలి విడతలో భాగంగా 7.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ పింక్ లైన్ ప్రారంభమైంది.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 7/21

అలాగే, ఏడు మెట్రోస్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 21.25 కిలోమీటర్ల మేర పింక్ లైన్ నిర్మాణం జరుగుతోంది.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 8/21

ఈ లైన్‌లో మొత్తం 18 స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 9/21

ఈ ఎలివేటెడ్ మార్గం నిర్మాణానికి సుమారు రూ.3,470 కోట్ల వ్యయం కానుంది.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 10/21

కాగా, రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని కర్ణాటక సీఎం డీకే శివ‌కుమార్‌ అన్నారు.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 11/21

శుక్రవారం కర్ణాటక పర్యటనకు వచ్చిన ఆయన బెంగళూరు ఎస్‌-వ్యాస యూనివర్సిటీ స్వర్ణోత్సవ భవనాన్ని ప్రారంభించారు.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 12/21

నమ్మ మెట్రోలో భాగంగా 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని జాతికి అంకితం చేశారు.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 13/21

రూ.15,600 కోట్ల అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 14/21

అనంతరం మైసూరుకు వెళ్లి, కాస్మోస్‌ ప్లానెటోరియాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 15/21

నమ్మ మెట్రో రైలులో తావరకెరె నుంచి ఐఐఎంబీ స్టేషన్‌ వరకూ ప్రధాని మోదీ ప్రయాణించారు.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 16/21

అనంతరం ఐఐఎంబీ మెట్రోస్టేషన్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 17/21

భారతీయ రైల్వేలో కొత్త చరిత్ర మొదలైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 18/21

రైల్వేస్టేషన్లు విమానాశ్రయాల తరహాలో రూపు దిద్దుకుంటున్నాయని తెలిపారు.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 19/21

ఈ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం డీకే శివకుమార్.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 20/21

దేశంలో మధ్యతరగతి ప్రజలు పెరిగారని, ఇళ్లల్లో రిఫ్రిజిరేటర్‌, టీవీ, పిల్లలకు ఉత్తమ విద్య, ఆరోగ్య సౌలభ్యాలు, పర్యాటకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇదే దేశాభివృద్ధికి కొత్త ఇంజన్‌ అని ప్రధాని మోదీ అభివర్ణించారు.

బెంగళూరులో పింక్ లైన్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ 21/21

రైళ్ల సంఖ్య పెరగడంతో పాటు వందేభారత్‌ లాంటి హైస్పీడ్‌ రైళ్లు దేశమంతటా అందుబాటులోకి వచ్చాయని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.

Updated at - Nov 14 , 2026 | 08:45 AM