కార్తీక మాసం ఎఫెక్ట్.. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Nov 15 , 2026 | 07:22 PM

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం యాదగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. కార్తీక మాసంతో పాటు వారాంతం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు.

కార్తీక మాసం ఎఫెక్ట్.. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు 1/7

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం యాదగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. కార్తీక మాసంతో పాటు వారాంతం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు.

కార్తీక మాసం ఎఫెక్ట్.. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు 2/7

కార్తీక మాసం.. ఆదివారం సెలవు.. దీంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. గిరి ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సత్యనారాయణ స్వామి వ్రత మండపం వద్ద కూడా రద్దీ పెరగడంతో అధికారులు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు.

కార్తీక మాసం ఎఫెక్ట్.. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు 3/7

తెలంగాణలో ప్రముఖ వైష్ణవ క్షేత్రం యాదగిరిపై.. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని యాదగిరి నరసింహస్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారి కృప కటాక్షాలను పొందడానికి అధిక సంఖ్యలో భక్తులు.. గిరిపైన స్వామి వారి సన్నిధిలో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారు.

కార్తీక మాసం ఎఫెక్ట్.. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు 4/7

ముఖ్యంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మండపం వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. వ్రతాల నిర్వహణలో ఎలాంటి అంతరాయం కలగకుండా.. భక్తులు సౌకర్యవంతంగా, ప్రశాంత వాతావరణంలో వ్రతాలు ఆచరించేలా.. అధికారులు నిరంతరం పర్యవేక్షించారు.

కార్తీక మాసం ఎఫెక్ట్.. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు 5/7

ఆలయానికి పోటెత్తిన భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, ప్రసాదం ఇతర సౌకర్యాల విషయంలో కూడా.. అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

కార్తీక మాసం ఎఫెక్ట్.. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు 6/7

ఆదివారం వారాంతపు సెలవు కావడంతో యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు అవసరమైన ఏర్పాట్లు చేపడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

కార్తీక మాసం ఎఫెక్ట్.. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు 7/7

పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో గిరి ప్రాంగణమంతా భక్తుల రద్దీతో కిటకిటలాడింది.

Updated at - Nov 15 , 2026 | 07:22 PM