తిరుపతిలో గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - May 06 , 2026 | 07:18 PM
తిరుపతిలో చారిత్రాత్మక తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర మంగళవారం (2026, మే 5వ తేదీ) ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరలో భాగంగా రెండో రోజు బుధవారం వేలాదిగా భక్తులు తరలి వచ్చి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1/14
2026, మే 5వ తేదీ (మంగళవారం) తిరుపతిలో చారిత్రాత్మక తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర ఘనంగా ప్రారంభమైంది.
2/14
ఈ జాతరలో భాగంగా రెండో రోజు బుధవారం వేలాదిగా భక్తులు తరలి వచ్చి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
3/14
ఈ సందర్భంగా భక్తులు.. బైరాగి వేషాలు ధరించి సందడి చేశారు.
4/14
భక్తులు తమ ఒంటిపై విభూది పసుపు పూసుకుని.. రేగు పండ్ల దండులు, వేపకొమ్మలు ధరించి బైరాగులుగా మారతారు.
5/14
ఈ వేషం అమ్మవారికి తమను తాము అర్పించుకోవడాన్ని సూచిస్తుంది.
6/14
అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పొంగళ్లు సమర్పించి.. భక్తులు తమ ముక్కులు తీర్చుకుంటారు.
7/14
వేప కొమ్మలు చేతపట్టి, సాంప్రదాయ వస్త్రధారణతో తిరుపతి వీధుల గుండా గంగమ్మ ఆలయానికి భక్తులు తరలివస్తారు.
8/14
జై గంగమ్మ నినాదాలతో తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
9/14
మే 12న ప్రధాన జాతర జరుగుతుంది.
10/14
మే 13న విశ్వరూప దర్శనంతో ఈ జాతర ఉత్సవాలు ముగుస్తాయి.
11/14
మొత్తం 9 రోజుల పాటు ఈ జాతర ఉత్సవాలు జరుగుతాయి.
12/14
ఈ జాతర ఏడు రోజులు.. రకరకాల వేషధారణలతో.. తిట్లతో గంగమ్మను పూజించడం ఇక్కడ ప్రత్యేకత.
13/14
విచిత్ర వేషధారణతో ఈ దేవాలయానికి వచ్చిన చిన్న పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
14/14
ఈ జాతర సందర్భంగా గంగమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది.
Updated at - May 06 , 2026 | 07:28 PM