శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం
ABN, Publish Date - Nov 24 , 2026 | 09:35 PM
తిరుమలలోని శ్రీవారి అలయంలో మంగళవారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది.
1/7
తిరుమలలోని శ్రీవారి అలయంలో మంగళవారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
2/7
సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం పక్కనవున్న పరిమళపు అర దగ్గర కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు.
3/7
అనంతరం భక్తులు విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారు బావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర వద్ద దీపాలు వెలిగించారు.
4/7
ఈ సందర్భంగా ఆలయాలన్నీ దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ప్రత్యేక పూజలు, దీపారాధనలను భక్తులు నిర్వహించారు.
5/7
శ్రీవారి ఆలయంలో కార్తీకదీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు.
6/7
మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ వెయ్యికి పైగా నేతి దీపాలతో శ్రీవారి ఆలయం దేదీప్యమానంగా వెలిగింది.
7/7
ఈ కార్తీక దీపోత్సవంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ, టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ శ్రీ భాస్కర్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
Updated at - Nov 24 , 2026 | 09:38 PM