తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. హనుమంత వాహనంపై శ్రీవారు
ABN, Publish Date - Oct 17 , 2026 | 12:07 PM
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. ఆరోరోజు హనుమంత వాహనం శ్రీవారు తిరుమాడ వీధులో ఊరేగుతున్నారు. హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో ఆసీనులై ఉన్న శ్రీవారిని దర్శించుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల మధ్య ఈ వేడుక ఘనంగా సాగింది. గోవిందనామ స్మరణతో తిరుమాడ వీధులు మార్మోగాయి.
1/7
తిరుమలలో అంగరంగ వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు
2/7
ఆరోరోజు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న మలయప్పస్వామి
3/7
హనుమంత వాహనం ఆశీనులైన కోదండరాముని అలంకరారంలో ఉన్న మలయప్పస్వామి భక్తులు దర్శించుకున్నారు.
4/7
చేతిలో ధనస్సు, బానం ధరించి.. హనుంత వాహనంపై శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
5/7
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల మధ్య ఈ వేడుక అత్యంత వైభవంగా సాగింది.
6/7
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు.
7/7
హనుంతమ వాహన సేవ ముందు వివిధ కళా బృందాల ప్రదర్శనలు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Updated at - Oct 17 , 2026 | 12:08 PM