సింహాచలంలో ప్రారంభమైన భక్తుల గిరి ప్రదక్షణ

ABN, Publish Date - Jul 28 , 2026 | 03:19 PM

విశాఖపట్నం జిల్లాలోని సింహాచలంలో సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షణ మంగళవారం (28-07-2026) ప్రారంభమైంది. ఈ గిరి ప్రదక్షిణకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు సింహాచలంకు భారీగా తరలివస్తున్నారు.

సింహాచలంలో ప్రారంభమైన భక్తుల గిరి ప్రదక్షణ 1/4

విశాఖపట్నం జిల్లాలోని సింహాచలంలో సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షణ మంగళవారం (28-07-2026) ప్రారంభమైంది. ఈ గిరి ప్రదక్షిణకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు సింహాచలంకు భారీగా తరలివస్తున్నారు.

సింహాచలంలో ప్రారంభమైన భక్తుల గిరి ప్రదక్షణ 2/4

అప్పన్న తొలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి భక్తులు ప్రదక్షణ చేపట్టారు. 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షణ చేసి బుధవారం ఉదయానికి అప్పన్న ఆలయానికి చేరుకుంటారు.

సింహాచలంలో ప్రారంభమైన భక్తుల గిరి ప్రదక్షణ 3/4

ఈ ఏడాది దాదాపు 10 లక్షల మందికిపైగా భక్తులు గిరి ప్రదక్షణ చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా సింహాచలం దేవస్థానం, జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

సింహాచలంలో ప్రారంభమైన భక్తుల గిరి ప్రదక్షణ 4/4

భక్తులకు ఈ రోజు, రేపు (మంగళ, బుధవారం) అప్పన్న ఉచిత దర్శనం కల్పిస్తామని దేవస్థానం అధికారులు వెల్లడించారు. ప్రతీ ఏడాది ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈ గిరి ప్రదక్షణ అత్యంత వైభవంగా జరుగుతుంది.

Updated at - Jul 28 , 2026 | 03:23 PM