శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు.. పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Jan 26 , 2026 | 07:38 AM
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టులో కొలువుదీరిన శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ దేవాలయ ప్రాంగణంలో అనారోగ్యంతో ఉన్న భక్తులు అడుగు పెడితే.. వారికున్న రోగాలు మటుమాయం అవుతాయని భక్తులు నమ్ముతారు. అందుకే దేవాలయ ప్రాంగణంలో మండల, అర్ధమండల దీక్ష తీసుకొని స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే తమ ఆరోగ్యం చక్కబడుతుందని చెబుతారు. ఈ నేపథ్యంలో ఈ ఆలయాన్ని ఆరోగ్యక్షేత్రంగా పిలుస్తారు. నార్కట్‌పల్లి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది.
1/6
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టులో కొలువుదీరిన శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
2/6
ఈ దేవాలయ ప్రాంగణంలో అనారోగ్యంతో ఉన్న భక్తులు అడుగు పెడితే.. వారికున్న రోగాలు మటుమాయం అవుతాయని భక్తులు నమ్ముతారు. అందుకే దేవాలయ ప్రాంగణంలో మండల, అర్ధమండల దీక్ష తీసుకొని స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే తమ ఆరోగ్యం చక్కబడుతుందని చెబుతారు.
3/6
ఈ నేపథ్యంలో ఈ ఆలయాన్ని ఆరోగ్యక్షేత్రంగా పిలుస్తారు. నార్కట్‌పల్లి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది.
4/6
ఎన్నో ఆసుపత్రులు తిరిగినా.. చేకూరని ఆరోగ్యం ఇక్కడ నిద్ర చేస్తే నయమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఆ ఆలయంలో నిద్ర చేసేందుకు భక్తులు పోటెత్తుతారు.
5/6
పౌర్ణమి రోజు.. చండీ హోమం, ప్రతి నెలా అమావాస్య రోజు.. లక్ష పుష్పార్చన, ఆ ముందు వచ్చే రోజు.. చతుర్దశి ఘడియల్లో రుద్రహోమం నిర్వహిస్తారు.
6/6
నిద్ర చేసేందుకు వచ్చే భక్తులతో ఈ దేవాలయం ప్రాంగణం కిక్కిరిసి పోతుంది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు.
Updated at - Jan 26 , 2026 | 07:39 AM