కన్నుల పండువగా ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ వేడుకలు.. పాల్గొన్న ప్రధాని మోదీ
ABN, Publish Date - Jan 12 , 2026 | 09:20 AM
గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయంలో నిర్వహిస్తున్న ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ప్రారంభమైన ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, వారసత్వం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం నాడు సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు.
1/7
గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయంలో నిర్వహిస్తున్న ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ప్రారంభమైన ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, వారసత్వం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.
2/7
ఈ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమనాథ్ ఆలయాన్ని ఆదివారం నాడు సందర్శించారు. స్వయంగా సోమనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
3/7
ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ బ్రాహ్మణులు వేద మంత్రోచ్ఛారణలతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.
4/7
ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా ప్రధానికి ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను మోదీకి అందజేశారు. అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రధానికి ప్రత్యేక సన్మానం నిర్వహించారు.
5/7
ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొనడం అక్కడి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ దర్శనం అనంతరం ప్రధాని ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
6/7
ఈ సందర్భంగా మోదీ సభలో ప్రసంగించారు. సోమనాథ్ ఆలయ చరిత్ర, విశిష్టత, భారతీయ నాగరికతకు ఈ ఆలయం చేసిన సేవలను ప్రధాని గుర్తు చేశారు.
7/7
సోమనాథ్ అనేది కేవలం ఒక ఆలయం కాదని, భారతీయుల ఆత్మగౌరవానికి, విశ్వాసానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిందని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఎన్నో దాడులు, విధ్వంసాలు జరిగినప్పటికీ ప్రతిసారి పునర్నిర్మాణం ద్వారా మరింత బలంగా నిలిచిన సోమనాథ్ ఆలయం భారతదేశ ప్రత్యేకతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
Updated at - Jan 12 , 2026 | 10:43 AM