ఖమ్మంలో అంగరంగ వైభవంగా టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి భూమిపూజ
ABN, Publish Date - Oct 13 , 2026 | 08:05 AM
ఖమ్మం నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ భూమిపూజ మహోత్సవాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
1/10
ఖమ్మం నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ భూమిపూజ మహోత్సవాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
2/10
ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడు, చిన్నజీయర్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.
3/10
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మహోత్సవ ఏర్పాట్లను స్వయంగా మంత్రి పర్యవేక్షించారు.
4/10
ఈ మహోత్సవానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
5/10
50 వేల మంది భక్తులకు భోజనం, స్వామివారి మహాప్రసాదం అందజేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
6/10
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామివారి పర్యవేక్షణలో భూమిపూజ మహోత్సవం, శిలాన్యాస పూజ చేశారు. ఆలయ నిర్మాణానికి మంత్రి తుమ్మల, టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు శంకుస్థాపన చేశారు.
7/10
ఖమ్మంలో ఈ ఆలయం నిర్మించడం తన పూర్వజన్మ సుకృతమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. ఈ మహత్కార్యానికి, భద్రాచల రామాలయం పునర్నిర్మాణానికి చిన్న జీయర్ స్వామి అంకురార్పణ చేశారని ప్రస్తావించారు.
8/10
వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చిన్నజీయర్ స్వామి మంగళాశాసనంతో జరుగుతోందని మంత్రి తుమ్మల తెలిపారు.
9/10
చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో ఏ కార్యక్రమం చేపట్టిన దిగ్విజయం అవుతుందని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడులకు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు చెప్పారు.
10/10
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం సుభిక్షంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు.
Updated at - Oct 13 , 2026 | 10:25 AM