ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం
ABN, Publish Date - Sep 24 , 2026 | 09:46 PM
హైదరాబాద్‌లో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం శుక్రవారం జరగనుంది. అందుకు కోసం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు ఖైరతాబాద్‌కు భక్తులు పోటెత్తారు.
1/12
హైదరాబాద్‌లో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం శుక్రవారం జరగనుంది. అందుకు కోసం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
2/12
స్వామి వారిని దర్శించుకునేందుకు ఖైరతాబాద్‌కు భక్తులు పోటెత్తారు.
3/12
భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.
4/12
ఖైరతాబాద్ నుంచి గణనాథుడి శోభాయాత్ర సజావుగా సాగేలా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
5/12
ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, వాహనాల పార్కింగ్, భక్తుల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
6/12
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
7/12
ఇక నగరంలోని ప్రధాన నిమజ్జన కేంద్రాల్లో ఒకటైన హుస్సేన్ సాగర్‌లో ఇప్పటికే వినాయక విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది.
8/12
వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న గణనాథులను నిమజ్జనం చేసేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
9/12
క్రేన్లు, గజ ఈతగాళ్లు, అత్యవసర సేవల సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
10/12
వినాయక నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్‌కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.
11/12
నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించింది.
12/12
ఈ నిమజ్జనం తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హుస్సేన్ సాగర్‌కు తరలి వస్తున్నారు.
Updated at - Sep 24 , 2026 | 09:57 PM