కార్తీక సోమవారం.. రాజమండ్రి పుష్కర్ ఘాట్‌కు పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Nov 16 , 2026 | 05:08 PM
కార్తీక మాసం.. తొలి సోమవారం కావడంతో రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్‌కు భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజామున పుష్కర్ ఘాట్‌కు చేరుకున్న భక్తులు.. గోదావరిలో స్నానమాచరించారు. అనంతరం ఆవు నెయ్యి దీపాలను గోదావరిలోకి వదిలారు.
1/9
కార్తీక మాసం.. తొలి సోమవారం కావడంతో రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్‌కు భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజామున పుష్కర్ ఘాట్‌కు చేరుకున్న భక్తులు.. గోదావరిలో స్నానమాచరించారు.
2/9
ఆవు నెయ్యి దీపాలను వెలిగించి.. వాటిని గోదావరి నదిలోకి వదిలారు.
3/9
పుష్కరఘాట్ సమీపంలోని శివాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు.
4/9
శివాలయానికి భక్తులు పోటెత్తారు. శివ నామస్మరణతో పుష్కరఘాట్ పరిసర ప్రాంతాలు మార్మోగాయి.
5/9
చిన్న పెద్లలంతా పుష్కరఘాట్‌కు చేరుకుని.. నదీస్నానం ఆచరించారు. అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేశారు.
6/9
నదిలో ఆవు నెయ్యి దీపాలను వదులుతున్న మహిళలు
7/9
జన సంద్రంగా మారిన పుష్కర్ ఘాట్.
8/9
రాజమండ్రి పుష్కర్‌ఘాట్‌లో ఛత్ పూజను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి తమ 36 గంటల కఠిన ఉపవాస దీక్షను విరమించారు.
9/9
బిహార్‌లో అతి ముఖ్యమైన పండగల్లో ఇది ఒకటి. రాజమండ్రిలో నివసిస్తున్న బిహార్ వాసులు తమ ఆచారం ప్రకారం సోమవారం పుష్కర్‌ఘాట్‌లో ఈ పండగ నిర్వహించారు.
Updated at - Nov 16 , 2026 | 05:30 PM