సికింద్రాబాద్‌లో వైభవంగా జగన్నాథస్వామి రథయాత్ర
ABN, Publish Date - Jul 16 , 2026 | 05:20 PM
జగన్నాథ స్వామి రథయాత్రతో సికింద్రాబాద్ గురువారం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని జగన్నాథస్వామి, బలభద్రస్వామి, సుభద్రాదేవిలను దర్శించుకున్నారు.
1/8
జగన్నాథస్వామి రథయాత్రతో సికింద్రాబాద్ గురువారం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథస్వామి రథయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది.
2/8
ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని జగన్నాథస్వామి, బలభద్రస్వామి, సుభద్రాదేవిలను దర్శించుకున్నారు.
3/8
నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ రథయాత్ర భక్తి, ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచింది.
4/8
ప్రత్యేకంగా అలంకరించిన భారీ రథంలో జగన్నాథస్వామి, బలభద్రస్వామి, సుభద్రాదేవి విగ్రహాలను ప్రతిష్ఠించి ఊరేగించారు.
5/8
పలు రకాల పూలతో రథాన్ని అలంకరించారు. ఈ రథం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ రథయాత్రలో భక్తులు ‘జై జగన్నాథ్, హరే కృష్ణ, హరే రామ’ నామస్మరణలతో నినదించారు
6/8
ఇస్కాన్ భక్తులు నిర్వహించిన సంకీర్తనలు, భజనలు, నృత్య ప్రదర్శనలు ఈ కార్యక్రమానికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చాయి.
7/8
సికింద్రాబాద్ రథయాత్రలో మహిళలు, యువత, చిన్నారులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగుతూ తమ ఆధ్యాత్మిక అనుబంధాన్ని చాటుకున్నారు. మార్గమధ్యంలో భక్తులకు ప్రసాదాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రథయాత్ర సాఫీగా సాగేందుకు పోలీసులు, నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
8/8
అలాగే, సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని జగన్నాథ్ స్వామి దేవాలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
Updated at - Jul 16 , 2026 | 06:17 PM