విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని, దర్శకుడు రాఘవేంద్రరావు

ABN, Publish Date - Oct 19 , 2026 | 10:01 AM

విజయవాడ ఉత్సవ్‌లో ఆదివారం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఎంపీలు‌ కేశినేని శివనాథ్, తెన్నేటి కృష్ణప్రసాద్, కోమటి జయరాం, పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని, దర్శకుడు రాఘవేంద్రరావు 1/7

విజయవాడ ఉత్సవ్‌లో ఆదివారం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఎంపీలు‌ కేశినేని శివనాథ్, తెన్నేటి కృష్ణప్రసాద్, కోమటి జయరాం, పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని, దర్శకుడు రాఘవేంద్రరావు 2/7

విజయవాడ ఉత్సవ్‌ 2.0కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు.

విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని, దర్శకుడు రాఘవేంద్రరావు 3/7

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విజయవాడ ఉత్సవ్‌కు రావడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ఢిల్లీ తర్వాత విజయవాడకు జాతీయ సరస్ మేళాను తీసుకు రావడంలో‌ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చాలా కృషి చేశారని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశంసించారు.

విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని, దర్శకుడు రాఘవేంద్రరావు 4/7

విభిన్న సంప్రదాయాలు, సంస్కృతుల మేళ‌వింపు విజయవాడ ఉత్సవ్ అని తెలిపారు. సరస్ మేళాకు పెద్దసంఖ్యలో సందర్శకులు తరలి వస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు.

విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని, దర్శకుడు రాఘవేంద్రరావు 5/7

మహిళలు, పేదలు ఆర్థిక వృద్ది సాధించడమే ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు

విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని, దర్శకుడు రాఘవేంద్రరావు 6/7

మహిళలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో సరస్ మేళాను నిర్వహిస్తున్నారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. గత ఏడాది విజయవాడ ఉత్సవ్ ద్వారా శివనాథ్ ఇప్పటికే నగరానికి ఓ బ్రాండ్ తెచ్చారని ప్రస్తావించారు.

విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని, దర్శకుడు రాఘవేంద్రరావు 7/7

విజయవాడలో తాను 2004లో సీపీగా పని చేశానని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ తెలిపారు. మళ్లీ‌ ఈ కార్యక్రమంలో‌ పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నిజంగా దసరా ఉత్సవాలంటే ఇలా ఉండాలని చెప్పుకొచ్చారు. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఉత్సవ్‌లో జరిగే కార్యక్రమాలను తిలకించాలని సూచించారు.

Updated at - Oct 19 , 2026 | 10:10 AM