తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ నిధులు..
ABN, Publish Date - Jul 22 , 2026 | 09:37 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో పడుతున్నాయి. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 13 వేలు జమయ్యాయి. ఈ పథకం కింద ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఈ మొత్తం జమవుతుంది. అనంతపురంలో నగదు తీసుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులకు వచ్చిన తల్లులు.
1/12
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో పడుతున్నాయి.
2/12
అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమయ్యాయి.
3/12
ఈ పథకం కింద ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఈ మొత్తం జమవుతుంది.
4/12
ఈ రోజు (22-07-2026) నుంచి జులై 24వ తేదీ వరకు తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమవుతాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
5/12
ఏ ఒక్క విద్యార్థి విద్యకు దూరం కాకూడదనే ఈ పథకం అమలుచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
6/12
రాష్ట్రంలో 67,47,190 మంది విద్యార్థులకు రూ.10,120 కోట్ల ఆర్థిక సాయం చేశారు.
7/12
ఎక్కడా అవినీతికి తావు లేకుండా 42,70,842 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా ఈ నగదును జమ చేస్తున్నారు.
8/12
ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అందరికీ ఈ సహాయం అందిస్తున్నారు.
9/12
ఈ నగదు డ్రా చేసేందుకు తల్లులు భారీ ఎత్తున బ్యాంకులు, పోస్టాఫీసుకు తరలి వచ్చారు. దీంతో అవి కిక్కిరిసి పోయాయి.
10/12
'తల్లికి వందనం'తో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు.
11/12
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో తల్లుల ఖాతాల్లో ఈ రోజు తల్లికి వందనం నిధులు జమవుతున్నాయని చెప్పారు.
12/12
ఈ కూటమి ప్రభుత్వంలో అదనంగా 17,000 మంది అంగన్‌వాడీల పిల్లలకు కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామని ఎమ్మెల్యే కల్వా శ్రీనివాసులు గుర్తుచేశారు.
Updated at - Jul 22 , 2026 | 09:57 PM