శ్రీకాకుళం జిల్లాలో నేత్రపర్వంగా శ్రీ ముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థస్నానాలు..
ABN, Publish Date - Feb 18 , 2026 | 08:11 PM
శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా బుధవారం చక్రతీర్థ స్నానాల కోసం ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయ అధికారులతో పాటు పోలీసులు సమన్వయంతో అన్ని చర్యలు చేపట్టారు.
1/14
శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నది.. శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినవి.
2/14
ముఖ్యంగా చక్రతీర్థ స్నానం ఈ ఉత్సవాల్లో అత్యంత పవిత్రమైన ఘట్టంగా భక్తులు భావిస్తారు.
3/14
అనంతరం ఉత్సవమూర్తులను నందివాహనంపై ఆశీనులుగా చేసి గ్రామోత్సవాన్ని ప్రారంభిస్తారు.
4/14
పాడ్యమి గడియలు రాగానే రాత్రి 12.30 గంటలకు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు ధరింపజేసి, పూలమాలలతో సుందరంగా అలంకరిస్తారు.
5/14
ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ అధికారులతో పాటు పోలీసులు సమన్వయంతో అన్ని చర్యలు చేపట్టారు.
6/14
ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం స్వామివారిని భక్తుల మధ్య ఘనంగా ఊరేగిస్తూ వంశధార నది తీరానికి తీసుకెళ్తారు. అక్కడ స్వామివారికి పవిత్ర స్నానాలు నిర్వహించి తిరిగి ఆలయానికి తీసుకువస్తారు.
7/14
చక్రతీర్థ స్నానం సందర్భంగా భక్తులు కూడా పవిత్ర వంశధార నదిలో స్నానాలు ఆచరిస్తారు. ఈ స్నానం చేయడం ద్వారా పాపాలు తొలగి శివుని కృప లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
8/14
అత్యవసర పరిస్థితుల్లో త్వరగా స్పందించేందుకు ప్రత్యేక బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు.
9/14
ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
10/14
ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా సౌకర్యాలు, భద్రతా చర్యలు చేపట్టారు.
11/14
చక్రతీర్థ స్నానాల సందర్భంగా భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షించారు.
12/14
స్వామివారి ఊరేగింపు సమయంలో నాలుగు వరుసల బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదనంగా నాలుగు రోప్ పార్టీలను నియమించి భక్తుల రాకపోకలను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు.
13/14
అలాగే ఎల్.ఎన్.పేట మండలం మిరియాపల్లి సమీపంలోని వంశధార నదిలో కూడా ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తుల భద్రత కోసం భారీగా పోలీసు సిబ్బందిని నియమించారు.
14/14
భక్తులు సురక్షితంగా నదిలోకి వెళ్లేందుకు ప్రత్యేక నడక మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. చక్రతీర్థ స్నానాలు సక్రమంగా నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Updated at - Feb 18 , 2026 | 08:20 PM