ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు

ABN, Publish Date - May 11 , 2026 | 08:12 AM

ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు.

ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు 1/6

ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు.

ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు 2/6

ప్రధాని రాకను గురించి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని రాకను పురస్కరించుకుని ఇంటి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు 3/6

ప్రధాని మోదీకి స్వాగతం పలకడం నుంచి ఆతిథ్యం వరకు అన్ని విషయాలను మంత్రి లోకేశ్ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు.

ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు 4/6

ప్రధాని మోదీ.. తమ నివాసానికి రావడం ఒక మధుర జ్ఞాపకమని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. తమ నివాసానికి విచ్చేసిన ప్రధాని మోదీ.. ఎంతో ఆత్మీయంగా అందరినీ పలకరించారని చెప్పారు.

ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు 5/6

ఒక దేశ ప్రధానిగా కాకుండా.. కుటుంబ సభ్యునిలా ఆయన పంచిన ప్రేమ, ఆప్యాయత తమను ఎంతో ఆకట్టుకుందన్నారు. దివంగత నందమూరి తారకరామారావు స్వయంగా పూజించిన శ్రీరాముని విగ్రహాలకు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు.

ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు 6/6

ప్రధానమంత్రి అందించిన ఈ ఆత్మీయ గౌరవం తమ కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప జ్ఞాపకమని నారా భువనేశ్వరి ఎక్స్ ఖాతా వేదికగా పేర్కొన్నారు.

Updated at - May 11 , 2026 | 08:24 AM