విజయవాడలో హస్తకళల ఉత్సవాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్
ABN, Publish Date - Jul 07 , 2026 | 08:27 PM
విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) నిర్వహించిన 'ఆంధ్రప్రదేశ్ హస్తకళల ఉత్సవం 2026'ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు (మంగళవారం) ప్రారంభించారు.
1/23
విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) నిర్వహించిన 'ఆంధ్రప్రదేశ్ హస్తకళల ఉత్సవం 2026'ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు (మంగళవారం) ప్రారంభించారు.
2/23
ఈ ఉత్సవంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ హస్తకళాకారులు రూపొందించిన కళారూపాలను ప్రదర్శించారు.
3/23
ఈ సందర్భంగా, రామాయణంలోని రావణ సంహార ఘట్టాన్ని తోలుబొమ్మలాట కళాకారులు ప్రదర్శించిన తీరును పవన్ కల్యాణ్ అభినందించారు.
4/23
ప్రతి స్టాల్‌ను సందర్శించి, హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా కళాకారులను వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ ప్రోత్సహించారు.
5/23
కళాకారులతో కలిసిపోయి, వారి నైపుణ్యాలను ప్రశంసించారు. వారి విజయాలు, సవాళ్ల గురించి అడిగి తెలుసుకున్నారు.వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. కళాకారుల కోరిక మేరకు, క్లస్టర్ల వారీగా గ్రూప్ ఫొటోలు తీసుకున్నారు.
6/23
ఆంధ్రప్రదేశ్ హస్తకళల ఉత్సవంలో మొదటి అడుగుగా కాకినాడకు చెందిన తోలుబొమ్మలాట కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్‌ను పవన్ కల్యాణ్ సందర్శించారు.
7/23
సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా రూపొందించిన రామాయణ, మహాభారత, భాగవత కళారూపాలను పరిశీలించారు.
8/23
తోలుబొమ్మలాట కళాకారులు ప్రదర్శించిన రావణ వధ ఘట్టం అందరినీ ఆకట్టుకుంది.
9/23
సంప్రదాయంగా తోలుబొమ్మలాటను జీవనోపాధిగా చేసుకున్న తమ కుటుంబాలు, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి చేరుకున్నాయని కళాకారులు వివరించారు.
10/23
ఈ కళారూపాల గొప్పతనాన్ని ప్రదర్శించడానికి, రాబోయే గోదావరి పుష్కరాల సమయంలో ప్రత్యేక తోలుబొమ్మలాట ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
11/23
ఉప్పాడ చీరల స్టాల్‌ను పవన్ కల్యాణ్ సందర్శించారు. తన సతీమణి అన్నా కొణిదెల కోసం మూడు ఉప్పాడ జామ్దానీ పట్టు చీరలను కొనుగోలు చేశారు.
12/23
అరటి పీచుతో చేసిన హ్యాండ్‌బ్యాగులు, ఫైల్స్, ఇతర పర్యావరణ అనుకూల ఉత్పత్తులపై ప్రత్యేక ఆసక్తి కనపరిచారు.
13/23
కళాకారుల నుంచి ఉత్పత్తి పద్ధతుల గురించి ఆరా తీసి, వారి నుంచి ఒక హ్యాండ్‌బ్యాగ్‌ను కొనుగోలు చేశారు. తిరుపతి చెక్క శిల్పకారులు రూపొందించిన చెక్క బొమ్మల స్టాల్‌ను సందర్శించారు.
14/23
కళాకారుల అద్భుతమైన కళాఖండాలను ప్రశంసించి, వారి నుంచి వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కొనుగోలు చేశారు.
15/23
శ్రీకాళహస్తికి చెందిన కలంకారి వస్త్రాల స్టాల్ వద్ద, కలం కలంకారి కళతో రూపొందించిన వస్త్రాలు, పరుపుల షీట్లు పవన్ దృష్టిని ఆకర్షించాయి.
16/23
కలంకారి నేత కళాకారుల కఠోర శ్రమ గురించి ప్రతిఒక్కరూ తెలుసుకునేలా వీడియో డాక్యుమెంటరీలను రూపొందించాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.
17/23
సంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఏపీ పుట్టినిల్లు అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
18/23
ఒక జాతి గొప్పతనం నిర్మించిన భవనాల్లో కాదని, కళాకారుల్లో కనిపిస్తుందని అభివర్ణించారు.
19/23
కళాకారుల అద్భుత ప్రతిభను, వారి కష్టాన్ని గుర్తించడానికి తాను ఈ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. హస్తకళాకారుల వస్తువుల తయారీ మాత్రమే కాకుండా, వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారని పేర్కొన్నారు.
20/23
ఏపీ హస్తకళల అభివృద్ధికి తమ ప్రభుత్వం అవసరమైన మద్దతును అందిస్తోందని స్పష్టం చేశారు.
21/23
పర్యావరణ పర్యాటకం, ఆలయ పర్యాటకం తరహాలో హస్తకళల పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు.
22/23
కళాఖండాలను సృష్టించే కళాకారులకు తగిన గుర్తింపు లభించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
23/23
కళాకారుల పోరాటాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక డాక్యుమెంటరీలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వీబీజీ రామ్ జీ పథకం కింద క్లస్టర్ల వారీగా ఉమ్మడి సౌకర్యాల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Updated at - Jul 07 , 2026 | 08:38 PM