ఎన్టీఆర్‌కు కుటుంబ సభ్యుల ఘన నివాళి
ABN, Publish Date - Jan 18 , 2026 | 02:17 PM
తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన కథానాయకుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు. ఆదివారం ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఆయన అభిమానులు, టీడీపీ కేడర్ భారీగా పోటెత్తారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్, కేబినెట్‌తోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.
1/9
తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన కథానాయకుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు. ఆదివారం ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులతోపాటు తెలుగు ప్రజలు ఘనంగా నివాళులర్పించారు.
2/9
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయనకు ఏపీ మంత్రి నారా లోకేశ్ పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు.
3/9
ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్
4/9
ఎన్టీఆర్ ఘాట్‌లో కన్న తండ్రి ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
5/9
ఎన్టీఆర్‌కు నివాళులర్పించేందుకు ఘాట్‌కు వస్తున్న మంత్రి నారా లోకేశ్.
6/9
ఎన్టీఆర్ ఘాట్‌లో కన్న తండ్రి ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి
7/9
ఎన్టీఆర్ భవన్‌లో నందమూరి బాలకృష్ణ చిత్రంతో రూపొందించిన క్యాలండర్‌ను అభిమానుల మధ్య ఆయన ఆవిష్కరించారు.
8/9
ఎన్టీఆర్ భవన్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.
9/9
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీటీడీపీ కేడర్ భారీగా ఎన్టీఆర్ భవన్‌కు తరలి వచ్చింది.
Updated at - Jan 18 , 2026 | 06:16 PM