ప్రజాప్రతినిధుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం

ABN, Publish Date - Feb 27 , 2026 | 07:48 AM

కర్నూలు, నరసరావుపేట పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులకు ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ విందు ఏర్పాటు చేశారు. ఆత్మీయ కలయిక ఫ్యామిలీ గెట్ టుగెదర్‌ని తలపించింది. సరదా సంభాషణలతో ఆహ్లాదకర వాతావరణంలో గడిపారు.

ప్రజాప్రతినిధుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం 1/7

కర్నూలు, నరసరావుపేట పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులకు ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ విందు ఏర్పాటు చేశారు.

ప్రజాప్రతినిధుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం 2/7

ఆత్మీయ కలయిక ఫ్యామిలీ గెట్ టుగెదర్‌ని తలపించింది. నేతల కుటుంబసభ్యులు పరస్పరం పరిచయం చేసుకున్నారు. నేతలు ఇచ్చిన బహుమతులు స్వీకరించారు నారా లోకేశ్.

ప్రజాప్రతినిధుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం 3/7

పొలిటికల్ లైఫ్ నుంచి కాస్త రిలీఫ్‌గా డిన్నర్ మీటింగ్ సాగింది. పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడ సెటిల్ అయ్యారంటూ లోకేశ్ అడిగి తెలుసుకున్నారు.

ప్రజాప్రతినిధుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం 4/7

నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం నేతలు తనకు ఇచ్చిన దరఖాస్తుల్లో ఎన్ని పరిష్కారం అయ్యాయి? పరిశీలనలో ఏం ఉన్నాయి? ఏవి కాలేదు అనేవి తెలియజేసే నివేదికను ఆయా నేతలకు అందజేశారు.

ప్రజాప్రతినిధుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం 5/7

పొలిటికల్ లైఫ్ నుంచి కాస్త రిలీఫ్‌గా డిన్నర్ మీటింగ్ సాగింది. పిల్లలు ఏం చేస్తున్నారు ఆడుగుతూ వారితో సెల్ఫీలు దిగారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

ప్రజాప్రతినిధుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం 6/7

మహిళామణులకు మంగళగిరి పట్టుచీరలు పెట్టారు. విందు ముగిశాక గేటు వరకూ వెళ్లి అందరికీ ఆత్మీయ వీడ్కోలు పలికి సాగనంపారు.

ప్రజాప్రతినిధుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం 7/7

ఈ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated at - Feb 27 , 2026 | 08:32 AM