సాత్విక్ సాయిరాజ్‌ను అభినందించిన మంత్రి లోకేష్
ABN, Publish Date - Jun 25 , 2026 | 08:37 AM
అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్‌ను ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఉండవల్లిలోని మంత్రి నివాసంలో నారా లోకేష్‌ను సాత్విక్ సాయిరాజ్ కలిశారు.
1/4

2/4
ఇటీవల జరిగిన థామస్ కప్‌లో సాయిరాజ్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో అతడు మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాల అండగా ఉంటామని సాయిరాజ్‌కు విద్యా శాఖ మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, ఎండీ ఎస్.భరణి పాల్గొన్నారు.
3/4
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ అర్జున అవార్డుతో పాటు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ఎన్నో పతకాలు సాధించారు.
4/4
ప్రస్తుతం పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలో ఉన్నారు. 2023 అక్టోబర్ 10న డబుల్స్ విభాగంలో సాయిరాజ్ ప్రపంచ నంబర్-1 ర్యాంకు సాధించారు.
Updated at - Jun 25 , 2026 | 08:45 AM