విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి

ABN, Publish Date - Oct 17 , 2026 | 10:18 AM

విజయవాడ స్టెల్లా కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్, ఆ ట్రస్ట్ రక్త నిధి కేంద్రాన్ని ఎన్టీఆర్ మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి 1/13

విజయవాడలోని స్టెల్లా కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్, రక్త నిధి కేంద్రాన్ని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి 2/13

గత ఏడాది ఈ భవనాలకు శంకుస్థాపన చేసి, నిర్మాణాలను ట్రస్ట్ పూర్తి చేసింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని పేదలకు సేవలందించేలా తలసేమియా కేర్ సెంటర్, రక్తనిధి కేంద్రాలను ఆమె ప్రారంభించారు.

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి 3/13

ఈ ట్రస్టు ప్రారంభమైన మరుసటి ఏడాది నుంచే ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ పేదలకు వైద్యసేవలు అందించేలా ఎన్టీఆర్ ఆరోగ్య రథాలతో మొబైల్ క్లినిక్స్ నిర్వహిస్తున్నారు.

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి 4/13

ఇప్పటికే గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరంలలో బ్లడ్ సెంటర్లు పనిచేస్తున్న విషయం తెలిసిందే.

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి 5/13

ఇప్పుడు విజయవాడలోనూ బ్లడ్ సెంటర్‌ను నారా భువనేశ్వరి ప్రారంభించారు. గత ఏడాదే తలసేమియా లోపం ఉన్న చిన్నారులకు ఉచితంగా రక్తం అందించే సేవలను మొదలుపెట్టారు.

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి 6/13

ప్రస్తుతం విజయవాడలోనూ తలసేమియా కేర్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడారు.

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి 7/13

సమాజానికి ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ఎన్టీఆర్‌ ట్రస్ట్ ద్వారా తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని నారా భువనేశ్వరి వెల్లడించారు.

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి 8/13

తాను కూడా ప్రజలను ఇదే విషయాన్ని కోరుతున్నానని... అందరూ సహకారం అందించాలని నారా భువనేశ్వరి సూచించారు. తమకు సహకారాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి 9/13

ఈరోజు తనకు చాలా ప్రత్యేకమైన రోజు అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ మెమోరియల్ ట్రస్ట్ భవనం ద్వారా ప్రజలకు‌ ఓ భరోసా ఇస్తున్నామని నారా భువనేశ్వరి తెలిపారు.

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి 10/13

ఒక ప్రాణానికి మరో ప్రాణం సాయంతో కొత్త జీవితం అందించే రోజు అని నారా భువనేశ్వరి చెప్పుకొచ్చారు. రక్తదానం అనేది మరో మనిషికి ఇచ్చే జీవిత భరోసా అని వెల్లడించారు. ఎంతో బాధ్యతతో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించామని పేర్కొన్నారు.

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి 11/13

మా నాన్న నందమూరి తారకరామారావు తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని నారా భువనేశ్వరి తెలిపారు. సమాజంలో ఉన్న చివరి వ్యక్తి కూడా బాగుండాలని కోరుకునే వారని... ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్‌ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటైందని ప్రస్తావించారు.

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి 12/13

29 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఎంతో చేసినా... ఇంకా చేయాల్సింది చాలా ఉందని నారా భువనేశ్వరి అన్నారు. ప్రజలు కూడా తమ ట్రస్టుతో చేయి కలిపి సమాజంలో సేవా కార్యక్రమాల్లో‌ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి 13/13

తమ ట్రస్ట్ సమాజంలో బాధ్యతతో పని చేస్తోందని స్పష్టం చేశారు. తాను మేనేజింగ్ ట్రస్టీగా ఉండటం అదృష్టమని చెప్పారు. ఈ ట్రస్టు సేవ చేసే మనసున్న ప్రతి ఒక్కరిదీ అని తెలిపారు. ఆరోగ్య రంగంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. ఎన్టీఆర్‌ సంజీవని ద్వారా గ్రామాలు, ట్రైబల్ ఏరియాల్లో మొబైల్ వాహనాల ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

Updated at - Oct 17 , 2026 | 11:04 AM