బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ
ABN, Publish Date - Feb 27 , 2026 | 09:08 PM
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను ఇవాళ(శుక్రవారం) కలిశారు. ఈ సందర్భంగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. సంజయ్ దత్‌ను కలవడం ఆనందంగా ఉందని, ఏపీలో సినిమా రంగ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
1/5
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను ఇవాళ(శుక్రవారం) కలిశారు. ఈ సందర్భంగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
2/5
సంజయ్ దత్‌ను కలవడం ఆనందంగా ఉందని, ఏపీలో సినిమా రంగ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
3/5
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌లకు అనుమతులు సులభంగా లభించేలా సింగిల్ విండో వ్యవస్థను అమలు చేసే అంశంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
4/5
సినిమా నిర్మాతలు, దర్శకులు అనుమతుల కోసం అనేక కార్యాలయాలు తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే వేదిక ద్వారా అనుమతులు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని లోకేశ్ తెలిపారు.
5/5
ఈ చర్యల ద్వారా ఏపీలో సినిమా నిర్మాణం మరింత వేగవంతం అవుతుందని, రాష్ట్రం చిత్రీకరణకు అనువైన కేంద్రంగా మారుతుందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
Updated at - Feb 27 , 2026 | 09:08 PM