కూటమి ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ విందు
ABN, Publish Date - Feb 14 , 2026 | 07:47 AM
చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు సెగ్మెంట్ల కూటమి ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుక్రవారం రాత్రి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.
1/13
చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు సెగ్మెంట్ల కూటమి ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుక్రవారం రాత్రి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.
2/13
పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులను ఆహ్వానించి, ఆత్మీయ విందు సమావేశం ఏర్పాటు అనే సరికొత్త సంప్రదాయాన్ని ఆరంభించారు లోకేశ్.
3/13
ఉండవల్లి నివాసం ఆవరణలో చిత్తూరు, అనకాపల్లి జిల్లా పార్లమెంటు నియోజకవర్గాల కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు మంత్రి లోకేశ్ విందు ఇచ్చారు.
4/13
కుటుంబ సభ్యులతో వచ్చిన ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు.
5/13
నేతల కుటుంబ సభ్యులను మంత్రి లోకేశ్ పరిచయం చేసుకున్నారు. అంతా ఒకేచోట కూర్చుని సరదా సంభాషణలతో గడిపారు.
6/13
స్పీకర్, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలనే తేడా లేకుండా కుటుంబసభ్యుల్లా అంతా కలిసి ఒక పిక్నిక్ లా ఆత్మీయ విందులో ఆనందంగా గడిపారు.
7/13
వివిధ సమస్యలు, ప్రగతి పనులకు సంబంధించి తనకు ఇచ్చిన వినతులు ఏ దశలో ఉన్నాయో ఒక నివేదిక తయారుచేసి ఆయా ప్రజాప్రతినిధులకు మంత్రి నారా లోకేశ్ స్వయంగా అందించారు.
8/13
ఆత్మీయవిందు పూర్తయ్యాక మంత్రి నారా లోకేశ్ అతిథులందరినీ గేటు వరకూ వెళ్లి సాగనంపారు.
9/13
మహిళలకు మంగళగిరి పట్టుచీరలని మంత్రి లోకేశ్ కానుకగా అందజేశారు.
10/13
ఈ ఆత్మీయ సమావేశానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాశ్ (నగరి), వీఎం థామస్ (జీడీ నెల్లూరు), గురజాల జగన్ మోహన్ (చిత్తూరు), కె. మురళీమోహన్ (పూతలపట్టు), పులివర్తి వెంకట మణిప్రసాద్ (చంద్రగిరి), ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ (కుప్పం)... ఎంపీ సీఎం రమేష్ (అనకాపల్లి -బీజేపీ), అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (నర్సీపట్నం), హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు (పాయకరావుపేట) బండారు సత్యనారాయణ మూర్తి (మాడుగుల), కేఎస్ఎన్ఎస్ రాజు (చోడవరం), కొణతాల రామకృష్ణ (అనకాపల్లి - జనసేన), పంచకర్ల రమేశ్ బాబు (పెందుర్తి - జనసేన), సుందరపు విజయ్ కుమార్ (ఎలమంచిలి -జనసేన) కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు.
11/13
ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. ఇప్పటి వరకు వైసీపీ మనపై విమర్శలు చేస్తే.. మనం డిఫెన్స్ ఆడుతూ సమస్యను అధిగమిస్తున్నామని, ఇకపై గేమ్ ప్లాన్ మారుద్దామని, మనమే అఫెన్స్ గేమ్ ఆడదామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
12/13
వైసీపీ వైరస్‌లా ఎంత ప్రమాదకారో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పుకొచ్చారు. ఈ అఫెన్స్ గేమ్‌లో మంత్రులు కీలకంగా వ్యవహరించాలని మంత్రి లోకేశ్ స్పష్టంచేశారు.
13/13
ఈ నెల 28వ తేదీన అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో అతిపెద్ద ఫార్మా సంస్థ బ్లూజెట్‌కు శంకుస్థాపన చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు.
Updated at - Feb 14 , 2026 | 07:54 AM