కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి

ABN, Publish Date - Feb 28 , 2026 | 07:54 PM

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘోర విషాదానికి దారితీసింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 23 మంది కార్మికులు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 1/19

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘోర విషాదానికి దారితీసింది.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 2/19

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 23 మంది కార్మికులు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 3/19

పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 4/19

ప్రమాదం జరిగిన సమయంలో బాణసంచా కేంద్రంలో 30 మందికి పైగా కార్మికులు టపాసులు తయారు చేస్తున్నట్లు సమాచారం.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 5/19

అకస్మాత్తుగా జరిగిన భారీ విస్ఫోటనం కారణంగా అక్కడ పనిచేస్తున్న కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 6/19

పేలుడు ధాటికి కొంతమంది మృతదేహాలు గాల్లోకి ఎగిరిపడి సమీపంలోని పంటపొలాల్లో చెల్లాచెదురుగా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 7/19

మృతుల్లో ఎక్కువమంది మహిళలు ఉండటం ఈ ఘటన తీవ్రతను మరింత స్పష్టంగా చూపిస్తోంది.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 8/19

ఈ ప్రమాదంలో అనేకమంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని హుటాహుటినా కాకినాడ జీజీహెచ్‌కి తరలించి వైద్యం అందజేస్తున్నారు.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 9/19

గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 10/19

పేలుడు అనంతరం పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 11/19

భారీ శబ్ధం విని స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 12/19

గాయపడిన వారిని శిథిలాల మధ్య నుంచి బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 13/19

ఘటనాస్థలిలో మృతుల బంధువుల ఆర్తనాదాలు హృదయ విదారకంగా మారాయి. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 14/19

అధికారుల సమాచారం ప్రకారం, పొలాల మధ్య ఏర్పాటు చేసిన ఆరు షెడ్లలో బాణసంచా తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 15/19

పేలుడు సంభవించిన సమయంలో కొందరు కార్మికులు భోజనానికి వెళ్లినట్లు తెలుస్తోంది. లేకపోతే మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉండేదని అధికారులు తెలిపారు.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 16/19

ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ మాధవ్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 17/19

సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 18/19

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని సీఎం ఆదేశించారు.

కాకినాడ వేట్లపాలెంలో పేలుడు.. 23 మంది మృతి 19/19

ఈ ఘటనతో బాణసంచా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం, ప్రమాదకర పదార్థాలను నిర్లక్ష్యంగా నిర్వహించడం వంటి అంశాలు ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Updated at - Feb 28 , 2026 | 08:03 PM