గుంటూరు జింఖానా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jan 31 , 2026 | 09:19 AM

గుంటూరు సర్వ జన ఆసుపత్రి (జీజీహెచ్) అభివృద్ధిలో జింకానా తోపాటు అనేక మంది పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీజీహెచ్‌లో జింకానా రూ. 100 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ. 27 కోట్లతో నిర్మించిన కానూరి- జింకానా మాతా శిశు సంరక్షణ భవనం ప్రారంబోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గుంటూరు జింఖానా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు 1/10

గుంటూరు సర్వ జన ఆసుపత్రి (జీజీహెచ్) అభివృద్ధిలో జింకానా (GINCANA.. Guntur Medical College Alumni of North America) తోపాటు అనేక మంది పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

గుంటూరు జింఖానా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు 2/10

శుక్రవారం జీజీహెచ్‌లో జింకానా రూ. 100 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ. 27 కోట్లతో నిర్మించిన కానూరి- జింకానా మాతా శిశు సంరక్షణ భవనం(ఎంసీహెచ్ బ్లాక్) ప్రారంబోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గుంటూరు జింఖానా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు 3/10

మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్‌లో గుంటూరులోని పరేడ్ మైదానానికి చేరుకున్న ఆయనకు ఉన్నతాధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు.

గుంటూరు జింఖానా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు 4/10

జీజీహెచ్ ఎంసీహెచ్ బ్లాక్‌ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.

గుంటూరు జింఖానా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు 5/10

అనంతరం డోనర్స్ వాల్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. కొద్దిసేపు జింకానా ప్రతినిధులతో ముచ్చటించి.. ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు.

గుంటూరు జింఖానా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు 6/10

ఐదో అంతస్తులో ఏర్పాటు చేసిన జింకానా సభ్యుల సభలో ఆయన ప్రసంగించారు.

గుంటూరు జింఖానా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు 7/10

ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రసంగించారు.

గుంటూరు జింఖానా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు 8/10

సీఎం చంద్రబాబును జింకానా ప్రతినిధులు ఘనంగా సన్మానించి.. జ్ఞాపికను అందజేశారు.

గుంటూరు జింఖానా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు 9/10

ఈ సందర్భంగా వారితో సీఎం చంద్రబాబు ఫొటో దిగారు.

గుంటూరు జింఖానా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు 10/10

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి, రామాంజనేయులు, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రబాబు, జింకానా అధ్యక్షుడు రామకోటేశ్వరరావు, సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. ఈ భవన నిర్మాణం కోసం యూఎస్‌లో ఉంటున్న డాక్టర్‌ గవిని ఉమాదేవి కుటుంబం రూ.22 కోట్లు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

Updated at - Jan 31 , 2026 | 09:31 AM