తిరుమల శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ABN, Publish Date - Mar 21 , 2026 | 10:38 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమల శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు 1/10

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు 2/10

సీఎం హోదాలో ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులతో సామాన్య భక్తుడిలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి స్వామివారి దర్శనానికి వెళ్లారు.

తిరుమల శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు 3/10

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు 4/10

స్వామి వారి తీర్థ ప్రసాదాలను ముఖ్యమంత్రి దంపతులకు అందజేస్తున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.

తిరుమల శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు 5/10

శ్రీవారి ఆలయం ముందు భక్తులతో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల సందడి.

తిరుమల శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు 6/10

వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సీఎం చంద్రబాబు, మనవడు దేవాన్ష్ స్వయంగా అన్నప్రసాదాలను భక్తులకు వడ్డించారు.

తిరుమల శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు 7/10

భక్తులకు అన్నప్రసాదాలను స్వయంగా వడ్డిస్తున్న నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్

తిరుమల శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు 8/10

భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించిన తర్వాత అన్నదాన సత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం చేశారు.

తిరుమల శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు 9/10

ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనవడు దేవాన్ష్‌తో కలిసి భక్తుల దగ్గరికి వెళ్లి వారితో కరచాలం చేశారు. భక్తులు దేవాన్ష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తిరుమల శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు 10/10

భక్తులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మనవడు దేవాన్ష్ ఫోటో దిగారు.

Updated at - Mar 21 , 2026 | 11:53 AM