అమరావతిలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
ABN, Publish Date - Sep 23 , 2026 | 06:48 PM
రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలంఅబ్బరాజుపాలెంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి సీఎం చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేశారు.
1/10
రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి సీఎం చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేశారు.
2/10
అమరావతిలో ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థలు, ఆసుపత్రులను తీసుకురావడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.
3/10
అత్యాధునిక కంటి వైద్య సేవలు అందుబాటులోకి రావడం వల్ల రాజధాని ప్రాంతంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
4/10
ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి ద్వారా కంటి సంబంధిత వ్యాధులకు ఆధునిక వైద్యం, శస్త్రచికిత్సలు, పరీక్షలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
5/10
పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
6/10
ఈ ప్రాంతంలో ప్రముఖ సంస్థలు, విద్య సంస్థలు, వైద్య సంస్థలు ఏర్పాటు కావడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
7/10
ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయి.. అత్యాధునిక కంటి వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రాజధాని ప్రాంతంలో మరో కీలక వైద్య సంస్థ చేరుతుందని చెప్పారు.
8/10
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు.
9/10
రాజధాని అమరావతి ప్రాంతంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
10/10
రాజధాని ప్రాంతంలోని మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ కార్యమానికి హాజరయ్యారు.
Updated at - Sep 23 , 2026 | 07:05 PM