ఇది ఒక చరిత్ర : సీఎం చంద్రబాబు నాయుడు

ABN, Publish Date - Mar 30 , 2026 | 04:59 PM

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని నాయుడుపేటలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆయన ఇంటి పత్రాలను అందజేశారు. 2 అనంతరం ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మార్చి నెలలో మొన్ననే ఉగాది, నిన్న రంజాన్ జరుపుకున్నామన్నారు. ఈ రోజు 2,50,893 మందికి ఇళ్ల పండుగ జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఇది ఒక చరిత్ర అని అభివర్ణించారు.

ఇది ఒక చరిత్ర : సీఎం చంద్రబాబు నాయుడు 1/11

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని నాయుడుపేటలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆయన ఇంటి పత్రాలను అందజేశారు.

ఇది ఒక చరిత్ర : సీఎం చంద్రబాబు నాయుడు 2/11

అనంతరం ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మార్చి నెలలో మొన్ననే ఉగాది, నిన్న రంజాన్ జరుపుకున్నామన్నారు. ఈ రోజు 2,50,893 మందికి ఇళ్ల పండుగ జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఇది ఒక చరిత్ర అని అభివర్ణించారు.

ఇది ఒక చరిత్ర : సీఎం చంద్రబాబు నాయుడు 3/11

మీ అందరిలో ఆనందం చూస్తుంటే, తన జన్మ ధన్యమైందని అనిపిస్తోందన్నారు. భవిష్యత్తులో మీకన్నీ శుభాలే జరగాలని, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఒకప్పుడు గుడిసెల్లో ఉండేవారమన్నారు.

ఇది ఒక చరిత్ర : సీఎం చంద్రబాబు నాయుడు 4/11

ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు ఇవ్వాలని, పక్కా ఇళ్ల నిర్మాణాలకి యుగపురుషుడు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనేది టీడీపీ సిద్ధాంతమన్నారు.

ఇది ఒక చరిత్ర : సీఎం చంద్రబాబు నాయుడు 5/11

ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత తనదని.. వ్యవస్థలని అస్తవ్యస్తం చేశారని.. అన్నింటినీ సరి చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఇది ఒక చరిత్ర : సీఎం చంద్రబాబు నాయుడు 6/11

ధనికవర్గాలు ఉండే మాదిరిగా టిడ్కో ఇళ్లని నిర్మించిన ఘనత టీడీపీదేనని పేర్కొన్నారు. మంచి ఇళ్లు నిర్మిస్తే పాడు చేశారని.. పేదల పొట్ట కొట్టారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.

ఇది ఒక చరిత్ర : సీఎం చంద్రబాబు నాయుడు 7/11

ఈ ఏడాది చివరికి పది లక్షల ఇళ్లు ప్రజలకి అందివ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రజావేదిక విధ్వంసంతో మొదలెట్టి రాష్ట్రం మొత్తాన్ని విధ్వంసం చేసిందని వివరించారు.

ఇది ఒక చరిత్ర : సీఎం చంద్రబాబు నాయుడు 8/11

ఎక్కడ చూసినా అవినీతి, అధికార దుర్వినియోగమేనన్నారు. రూ.174కోట్లు లబ్ధిదారులు కడితే వాటినీ సైతం మాయం చేశారని చెప్పారు.

ఇది ఒక చరిత్ర : సీఎం చంద్రబాబు నాయుడు 9/11

82 వేల కుటుంబాలకి ఆ నగదును అకౌంట్లలో వేస్తామని.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులని దారి మళ్లించారంటూ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.

ఇది ఒక చరిత్ర : సీఎం చంద్రబాబు నాయుడు 10/11

నివాస యోగ్యం కాని స్థలాల్లో ఇళ్లు కట్టించారన్నారు. వైజాగ్‌లో ప్యాలెస్ నిర్మించుకున్నారు కానీ పేదలకి ఇళ్లు ఇవ్వడానికి వారికి మనసు రాలేదంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది ఒక చరిత్ర : సీఎం చంద్రబాబు నాయుడు 11/11

అంత పనికిమాలిన ప్రభుత్వాన్ని తాను తన జీవితంలో చూడలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

Updated at - Mar 30 , 2026 | 05:11 PM