నారావారి పల్లెలో దేవాన్ష్ సందడి..
ABN, Publish Date - Jan 14 , 2026 | 08:24 PM
భోగి పండగ వేళ.. సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినీ, శ్రీభరత్ దంపతుల చిన్నారులు నారావారి పల్లెలో ఎద్దుల బండిలో ఊరేగుతూ తెగ సందడి చేశారు.
1/6
భోగి పండగ వేళ.. సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినీ, శ్రీభరత్ దంపతుల పిల్లలు ఎద్దుల బండిలో ఊరేగారు.
2/6
ఈ ఎద్దుల బండిపై వారంతా అటుఇటు తిరిగారు. దేవాన్ష్‌తోపాటు శ్రీభరత్ దంపతుల చిన్నారులు సైతం ఈ సందర్భంగా గ్రామంలోని పిల్లలందరికీ చేతులు ఊపుతూ ఎద్దుల బండిలో తిరిగారు.
3/6
స్థానికంగా ఉన్న పెద్దలకు, చిన్నపిల్లలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు దేవాన్ష్. ఈ సందర్భంగా స్థానిక పిల్లల్లో ఆనందం వెల్లువిరిసింది.
4/6
ఇసుక రక్షణకు కోసం పోరాటం చేస్తున్న ఓ వృద్ధుడు.. దేవాన్ష్ కి ఇసుకను రక్షించాలి(SAVE SOIL) ప్ల కార్డును బహుకరించాడు.
5/6
ఎద్దుల బండిని బెలూన్లతో అందంగా అలంకరించి... ఊరంతా తిరిగి సందడి చేసిన దేవాన్ష్
6/6
నారావారి పల్లెలో స్థానికులకు సెల్ఫీ ఇస్తూ.. సందడి చేసిన నారా దేవాన్ష్.
Updated at - Jan 14 , 2026 | 08:26 PM