భాకరాపేటలో ఘనంగా పోలీసు కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్

ABN, Publish Date - Sep 26 , 2026 | 10:25 PM

బాకారాపేటలోని ఏపీఎస్పీ 11వ బెటాలియన్ పోలీసు పరేడ్ మైదానంలో శనివారం (26-09-2026) 521 మంది నూతనంగా శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు కానిస్టేబుళ్లు దీక్షాంత్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. క్రమశిక్షణ, అంకితభావంతో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ప్రజలకు సేవలందించేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.

భాకరాపేటలో ఘనంగా పోలీసు కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ 1/10

బాకారాపేటలోని ఏపీఎస్పీ 11వ బెటాలియన్ పోలీసు పరేడ్ మైదానంలో శనివారం (26-09-2026) 521 మంది నూతనంగా శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు కానిస్టేబుళ్లు దీక్షాంత్ పరేడ్ ఘనంగా నిర్వహించారు.

భాకరాపేటలో ఘనంగా పోలీసు కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ 2/10

క్రమశిక్షణ, అంకితభావంతో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ప్రజలకు సేవలందించేందుకు సిద్ధమయ్యారు.

భాకరాపేటలో ఘనంగా పోలీసు కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ 3/10

ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.

భాకరాపేటలో ఘనంగా పోలీసు కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ 4/10

పరేడ్ మైదానానికి చేరుకున్న వీరికి పోలీసు అధికారులు ఘనస్వాగతం పలికారు.

భాకరాపేటలో ఘనంగా పోలీసు కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ 5/10

శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు నిర్వహించిన మార్చ్‌పాస్ట్ ఆకట్టుకుంది.

భాకరాపేటలో ఘనంగా పోలీసు కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ 6/10

ఈ పరేడ్‌ను తిలకించిన మంత్రి సవిత.. నూతన కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ సమయంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించారు.

భాకరాపేటలో ఘనంగా పోలీసు కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ 7/10

పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భాకరాపేటలో ఘనంగా పోలీసు కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ 8/10

విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావం, మానవతా దృక్పథాన్ని పాటించాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని మంత్రి సవిత స్పష్టం చేశారు.

భాకరాపేటలో ఘనంగా పోలీసు కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ 9/10

ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, బెటాలియన్ అధికారులు, శిక్షణ సిబ్బంది, పోలీసు కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

భాకరాపేటలో ఘనంగా పోలీసు కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ 10/10

భారీగా నూతన కానిస్టేబుళ్లు పరేడ్‌లో పాల్గొనడంతో బాకరాపేట ఏపీఎస్పీ 11వ బెటాలియన్ మైదానం సందడిగా మారింది.

Updated at - Sep 26 , 2026 | 10:43 PM