విశాఖ మేయర్ ముక్కా శ్రావణి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేశ్

ABN, Publish Date - Nov 23 , 2026 | 09:42 PM

విశాఖపట్నం నగర మేయర్ ముక్కా శ్రావణి కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం నాడు పరామర్శించారు. ఆమె తండ్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ముక్కా ముత్యాల నాయుడు ఇటీవల మృతి చెందడంతో విశాఖపట్నంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

విశాఖ మేయర్ ముక్కా శ్రావణి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేశ్ 1/9

విశాఖపట్నం నగర మేయర్ ముక్కా శ్రావణి కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం నాడు పరామర్శించారు.

విశాఖ మేయర్ ముక్కా శ్రావణి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేశ్ 2/9

ఆమె తండ్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ముక్కా ముత్యాల నాయుడు ఇటీవల మృతి చెందడంతో విశాఖపట్నంలోని వారి నివాసానికి మంత్రి లోకేశ్ వెళ్లి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

విశాఖ మేయర్ ముక్కా శ్రావణి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేశ్ 3/9

ఈ సందర్భంగా ముత్యాల నాయుడు చిత్రపటం వద్ద పూలు ఉంచి మంత్రి నారా లోకేశ్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మేయర్ ముక్కా శ్రావణి, ఇతర కుటుంబ సభ్యులను కలిసి వారి కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం పట్ల విచారం వ్యక్తం చేశారు.

విశాఖ మేయర్ ముక్కా శ్రావణి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేశ్ 4/9

కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, కుటుంబ సభ్యులు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని మంత్రి లోకేశ్ ధైర్యం చెప్పారు.

విశాఖ మేయర్ ముక్కా శ్రావణి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేశ్ 5/9

ముక్కా ముత్యాల నాయుడు తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు అందించిన సేవలను మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

విశాఖ మేయర్ ముక్కా శ్రావణి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేశ్ 6/9

కార్పొరేటర్‌గా, టీడీపీ నాయకుడిగా, విశాఖపట్నం జిల్లా పార్టీ బీసీ విభాగం ఉపాధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలు అభినందనీయమని మంత్రి లోకేశ్ కీర్తించారు.

విశాఖ మేయర్ ముక్కా శ్రావణి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేశ్ 7/9

టీడీపీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషిని మంత్రి లోకేశ్ స్మరించుకున్నారు.

విశాఖ మేయర్ ముక్కా శ్రావణి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేశ్ 8/9

మంత్రి లోకేశ్ వెంట ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు చోడె పట్టాభిరాం, ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ గండి బాబ్జి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

విశాఖ మేయర్ ముక్కా శ్రావణి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేశ్ 9/9

ముక్కా ముత్యాల నాయుడు మృతి పట్ల పలువురు టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Updated at - Nov 23 , 2026 | 09:50 PM