మంత్రి లోకేశ్‌తో రోమన్ క్యాథలిక్ బిషప్స్ భేటీ
ABN, Publish Date - Mar 17 , 2026 | 07:20 AM
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌తో రోమన్ క్యాథలిక్ బిషప్స్ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఖమ్మం, ఏలూరు నుంచి బిషప్స్, ఛాన్సలర్లు వచ్చారు.
1/5
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌తో రోమన్ క్యాథలిక్ బిషప్స్ సమావేశమయ్యారు.
2/5
ఉండవల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఖమ్మం, ఏలూరు నుంచి బిషప్స్, ఛాన్సలర్లు వచ్చారు.
3/5
గత ముప్పై ఏళ్లుగా తమ చర్చల పరిధిలో ఎదుర్కొంటున్న పలు భూ సమస్యల గురించి ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌కు వారు వివరించారు. తమ పరిధిలో నడుస్తున్న విద్యా సంస్థల గురించి ఆయనకు బిషప్స్ వివరించారు.
4/5
తమ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్లను సందర్శించాలంటూ లోకేశ్‌ను వారు కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
5/5
ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేశ్‌కు వారు తెలిపారు. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు.
Updated at - Mar 17 , 2026 | 07:27 AM