విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి లోకేశ్, దేవాంశ్‌

ABN, Publish Date - Jul 19 , 2026 | 07:21 AM

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌) నుంచి విక్రమ్‌-1 నిప్పులు చిమ్ముతూ శనివారం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల 30 సెకన్లకు నింగిలోకి దూసుకుపోయింది. ఈ ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, తన కుమారుడు దేవాంశ్‌తో కలిసి వీక్షించారు.

విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి లోకేశ్, దేవాంశ్‌ 1/12

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌) నుంచి విక్రమ్‌-1 నిప్పులు చిమ్ముతూ శనివారం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల 30 సెకన్లకు నింగిలోకి దూసుకుపోయింది. ఈ ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, తన కుమారుడు దేవాంశ్‌తో కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు.

విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి లోకేశ్, దేవాంశ్‌ 2/12

మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి రాకెట్‌ గమనాన్ని వారు ఆసక్తిగా గమనించారు.

విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి లోకేశ్, దేవాంశ్‌ 3/12

విక్రమ్‌-1 రాకెట్‌ విజయవంతంపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి లోకేశ్, దేవాంశ్‌ 4/12

ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇద్దరూ ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు.

విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి లోకేశ్, దేవాంశ్‌ 5/12

స్కైరూట్‌ సంస్థ తొలి ప్రయత్నంలోనే రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడం వారి పనితీరుకు నిదర్శనమని లోకేశ్ ప్రశంసించారు.

విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి లోకేశ్, దేవాంశ్‌ 6/12

ఇదే స్పూర్తితో మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని లోకేశ్ ఆకాంక్షించారు. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో కూడా కంపెనీ పెట్టేందుకు అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు.

విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి లోకేశ్, దేవాంశ్‌ 7/12

తమ ప్రభుత్వం పరంగా కూడా అన్ని సహకారాలు అందించి ప్రోత్సహిస్తామని లోకేశ్ అన్నారు. ఏపీకి రావాలని ఆహ్వానించారు. ఇప్పటికే వైజాగ్‌లో ఆ కంపెనీ ప్రతినిధులను కలిశామని తెలిపారు.

విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి లోకేశ్, దేవాంశ్‌ 8/12

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మొట్టమొదటిసారి ఓ ప్రైవేటు ఏరోస్పేస్‌ సంస్థకు చెందిన ఆర్బిటాల్‌ రాకెట్‌ రోదసిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది.

విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి లోకేశ్, దేవాంశ్‌ 9/12

‘మిషన్‌ ఆగమన్‌’ పేరిట చేపట్టిన ఈ ప్రయోగంలో హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌ అయింది.

విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి లోకేశ్, దేవాంశ్‌ 10/12

ఓప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపడం ఇదే తొలిసారి కావడం ఒక విశేషమైతే.. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు విస్తృతమైన అవకాశాలు కల్పించే దిశగా ఈ ప్రయోగం కీలక పాత్ర పోషించడం మరో విశేషం.

విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి లోకేశ్, దేవాంశ్‌ 11/12

విక్రమ్‌-1 450 కిలో మీటర్ల ఎత్తుకు ప్రయాణించి 6 చిన్న ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో భారత ప్రైవేటు రంగం కూడా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపగల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటినట్లు అయింది.

విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన మంత్రి లోకేశ్, దేవాంశ్‌ 12/12

విక్రమ్‌-1 రాకెట్‌.. నిర్దేశిత సమయం కంటే 35 నిమిషాల పాటు ఆలస్యంగా నింగిలోకి తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

Updated at - Jul 19 , 2026 | 07:42 AM