శ్రీకాకుళం జిల్లాలో పోలీసు కానిస్టేబుళ్ల ‘పాసింగ్ అవుట్ పరేడ్.. హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు
ABN, Publish Date - Sep 30 , 2026 | 11:00 AM
శ్రీకాకుళం జిల్లాలోని తండ్యాంవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం (డీపీటీసీ)లో మంగళవారం 142 మంది సివిల్ పోలీసు కానిస్టేబుళ్ల (2025-26, 6వ బ్యాచ్) ప్రాథమిక శిక్షణ(10 నెలలపాటు) ముగింపు సందర్భంగా ‘పాసింగ్ అవుట్ పరేడ్ (దీక్షాంత్ పరేడ్)’ మంగళవారం అట్టహాసంగా జరిగింది.
1/7
శ్రీకాకుళం జిల్లాలోని తండ్యాంవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం (డీపీటీసీ)లో మంగళవారం 142 మంది సివిల్ పోలీసు కానిస్టేబుళ్ల (2025-26, 6వ బ్యాచ్) ప్రాథమిక శిక్షణ(10 నెలలపాటు) ముగింపు సందర్భంగా ‘పాసింగ్ అవుట్ పరేడ్ (దీక్షాంత్ పరేడ్)’ మంగళవారం అట్టహాసంగా జరిగింది.
2/7
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కింజరాపుఅచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల వాతును పరిశీలించి, గౌరవ వందనం స్వీకరించారు.
3/7
పోలీసులంటే ప్రజలో భయం కాదు.. బాధ్యత అనే భావన కలిగించాలని మంత్రి క అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాజ్యాంగానికి విధేయులుగా ఉంటూ, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. నిజాయితీ, నిష్పక్షపాతంతో సేవలు అందించాలని నూతన కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు.
4/7
పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని... సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత అని మంత్రి ఉద్ఘాటించారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటేనే పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చి ప్రగతి వేగంగా సాగుతుందని వివరించారు.
5/7
జగన్ హయాంలో పోలీసు రిక్రూట్‌మెంట్‌ను ఆపేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా కోర్టుల్లో కేసులు వేశారని మంత్రి అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వాటన్నింటినీ అధిగమించి కేవలం ఎనిమిది నెలల్లోనే 5,800 ఉద్యోగాలను భర్తీ చేసిందని వెల్లడించారు.
6/7
ఇందులో వెయ్యి మందికిపైగా మహిళా కానిస్టేబుళ్లు ఉండటం గర్వకారణమని మంత్రి చెప్పారు. మరో 1,156 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా ఇచ్చామని అన్నారు. ఇకపై ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పోలీసు నియామకాలు ఉంటాయని స్పష్టం చేశారు.
7/7
మారుత్నున కాలానికి అనుగుణంగా వైట్‌కాలర్ నేరాలు పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు. వీటితో పాటు గంజాయి నిర్మూలన, మహిళలపై నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత తదితర అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని నేరాలను సమర్థతంగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు.
Updated at - Sep 30 , 2026 | 11:07 AM