విజయవాడలో యోగాంధ్ర కార్యక్రమానికి మంత్రి అనిత శ్రీకారం
ABN, Publish Date - Jun 07 , 2026 | 09:39 PM
విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో 14 రోజుల పాటు నిర్వహించనున్న యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఈగల్ ఐజీ రవికృష్ణ, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ పాండ్యన్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
1/4
విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో 14 రోజుల పాటు నిర్వహించనున్న యోగాంధ్ర (Yogandhra) ప్రత్యేక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఈగల్ ఐజీ రవికృష్ణ, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ పాండ్యన్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
2/4
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణ లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. నిరంతరం ఒత్తిడితో పనిచేసే పోలీసు సిబ్బందికి యోగా ఒక సంజీవనిలా పనిచేస్తుందని పేర్కొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
3/4
అలాగే ‘డ్రగ్స్‌పై దండయాత్ర’ పేరుతో సైకిల్ యాత్ర చేపట్టి మాదకద్రవ్యాల వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తున్న ఎన్టీఆర్ జిల్లా పోలీసులను హోంమంత్రి అనిత అభినందించారు. సమాజంలో డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీసులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
4/4
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్న ‘గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ – ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని హోంమంత్రి అనిత సూచించారు.
Updated at - Jun 07 , 2026 | 09:48 PM