రాజానగరంలో అటవీశాఖ ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్

ABN, Publish Date - May 26 , 2026 | 07:21 AM

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని అటవీ శాఖ ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం పరిశీలించారు. పరిశోధన కేంద్రంలోని మొక్కల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు.

రాజానగరంలో అటవీశాఖ ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ 1/8

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని అటవీ శాఖ ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం పరిశీలించారు. పరిశోధన కేంద్రంలోని మొక్కల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు.

రాజానగరంలో అటవీశాఖ ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ 2/8

ప్రతి గ్రామ పంచాయతీలోనూ దేశవాళి జాతి మొక్కలతో ప్రత్యేక వనాన్ని తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు. మొక్కలను పెంచే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

రాజానగరంలో అటవీశాఖ ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ 3/8

గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే మొక్కల ఎదుగుదల సాఫీగా సాగుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతోపాటు దేశీయ మొక్కలను ఎక్కువగా పెంచితే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని పవన్ కల్యాణ్ వివరించారు.

రాజానగరంలో అటవీశాఖ ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ 4/8

వెంటనే దీనిపై దృష్టి సారించి పంచాయతీరాజ్ అధికారులు, అటవీశాఖ అధికారుల సంయుక్తంగా ఎంఓయూ కుదుర్చుకొని వనయజ్ఞం చేపట్టాలని స్పష్టం చేశారు.

రాజానగరంలో అటవీశాఖ ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ 5/8

పంచాయతీ వనంతో గ్రామాలకు హరితహారమని వ్యాఖ్యానించారు. వుడ్ బ్యాంక్ కోసం దేశీయ వృక్ష జాతి మొక్కలతో ప్రతి గ్రామపంచాయతీలోనూ ప్రత్యేక వనాలు ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ నిర్దేశించారు.

రాజానగరంలో అటవీశాఖ ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ 6/8

మొక్కల పెంపకం భావితరాలకు నేర్పించాలని డిప్యూటీ సీఎం సూచించారు.

రాజానగరంలో అటవీశాఖ ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ 7/8

ఆదాయం తెచ్చే మొక్కల పెంపకం ద్వారా పంచాయతీలకు ఆర్థిక వృద్ధి పెరుగుతుందని పవన్ కల్యాణ్ వివరించారు.

రాజానగరంలో అటవీశాఖ ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ 8/8

ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖలు ప్రత్యేక ఎంఓయూ కుదుర్చుకొని ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.

Updated at - May 26 , 2026 | 07:26 AM