అమరావతిలో 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం

ABN, Publish Date - Sep 11 , 2026 | 08:31 AM

సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. లీడర్‌షిప్, జీఎస్‌డీపీ, తాగునీరు, గృహ నిర్మాణం, జలధార, జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్‌ తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశం రెండు రోజుల పాటు జరగనుంది.

అమరావతిలో 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం 1/15

సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది.

అమరావతిలో 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం 2/15

8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

అమరావతిలో 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం 3/15

రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో లీడర్‌షిప్, జీఎస్‌డీపీ, తాగునీరు, గృహ నిర్మాణం, జలధార, జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్‌పై చర్చించారు.

అమరావతిలో 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం 4/15

ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం.. ప్రజా సేవకులుగా నిలుద్దామని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

అమరావతిలో 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం 5/15

సాధించింది చెబుదాం... సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుదామని వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అమరావతిలో 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం 6/15

రాష్ట్ర పునర్నిర్మాణంలో 27 నెలల్లో రాష్ట్ర ఆర్ధికవ్యవస్థను గాడిన పెట్టామని స్పష్టం చేశారు.

అమరావతిలో 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం 7/15

రూ.1.40 లక్షల కోట్లు సంక్షేమానికి, రూ. 1.50 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశామని వివరించారు.

అమరావతిలో 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం 8/15

రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరిట ప్రగతి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.

అమరావతిలో 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం 9/15

హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్ -1, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టులు పూర్తి చేశామని తెలిపారు.

అమరావతిలో 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం 10/15

పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు.

అమరావతిలో 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం 11/15

అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసి గుంటూరు, విజయవాడకు రాజధానిని కనెక్టు చేశామని తెలిపారు.

అమరావతిలో 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం 12/15

ఎకనామిక్ టైమ్స్ పత్రిక సీఈఓ టూ వాటర్‌మాన్ అంటూ కథనం రాసిందని.. ఇది తనకు సంతోషం కలిగించిందన్నారు. గ్లోబల్ డ్రీమ్ కేబినెట్లో తన పేరు వచ్చినప్పుడు, సీఈఓ సీఎం అన్నప్పుడు నేను ఇంత ఆనందించలేదని పేర్కొన్నారు.

అమరావతిలో 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం 13/15

మనకు ఉన్న అవకాశాలను అన్ లాక్ చేయగలిగామని.. ప్రతీ శాఖలోనూ సంస్కరణలు తీసుకువచ్చామని సీఎం చంద్రబాబు వివరించారు.

అమరావతిలో 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం 14/15

గత ప్రభుత్వం నిర్వాకంతో మార్కెట్‌లోకి వచ్చిన జే బ్రాండ్ మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని.. చాలా మంది ఆరోగ్యం కూడా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతిలో 8వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం 15/15

ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయంటే అభివృద్ధి-పాలన పెండింగ్‌లో ఉన్నట్లేనని సీఎం చంద్రబాబు తెలిపారు.

Updated at - Sep 11 , 2026 | 08:43 AM