ఏపీ కేబినెట్ భేటీ.. 60కు పైగా అజెండా అంశాలపై చర్చ

ABN, Publish Date - Sep 23 , 2026 | 01:23 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో దాదాపు 60కు పైగా అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గంతో సీఎం చర్చించారు.

ఏపీ కేబినెట్ భేటీ.. 60కు పైగా అజెండా అంశాలపై చర్చ 1/14

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది.

ఏపీ కేబినెట్ భేటీ.. 60కు పైగా అజెండా అంశాలపై చర్చ 2/14

ఈ కేబినెట్ భేటీలో దాదాపు 60కు పైగా అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గంతో సీఎం చర్చించారు.

ఏపీ కేబినెట్ భేటీ.. 60కు పైగా అజెండా అంశాలపై చర్చ 3/14

భారీ పెట్టుబడులు, పరిశ్రమలు, అమరావతి అభివృద్ధి అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.

ఏపీ కేబినెట్ భేటీ.. 60కు పైగా అజెండా అంశాలపై చర్చ 4/14

పరిశ్రమలకు టైలర్‌మేడ్‌ ప్రోత్సాహకాలపై కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

ఏపీ కేబినెట్ భేటీ.. 60కు పైగా అజెండా అంశాలపై చర్చ 5/14

వివిధ పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులపై చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

ఏపీ కేబినెట్ భేటీ.. 60కు పైగా అజెండా అంశాలపై చర్చ 6/14

అమరావతి మౌలిక వసతుల పనులకు అదనంగా రూ.644.98 కోట్ల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

ఏపీ కేబినెట్ భేటీ.. 60కు పైగా అజెండా అంశాలపై చర్చ 7/14

నీటి సరఫరా, మురుగునీరు, స్టార్మ్‌ వాటర్‌, రోడ్లు, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటుపై మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది. అమరావతి అసెంబ్లీ భవన్ స్పైర్‌, రూఫ్‌, లిఫ్టుల పనులకు రూ.661 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

ఏపీ కేబినెట్ భేటీ.. 60కు పైగా అజెండా అంశాలపై చర్చ 8/14

ఎల్‌పీఎస్‌ రైతులకు కనీస యాన్యుటీ చెల్లింపుపై నిబంధనలను మంత్రిమండలి సవరించనుంది. ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు రుణాల కోసం ప్రభుత్వ హామీలపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది.

ఏపీ కేబినెట్ భేటీ.. 60కు పైగా అజెండా అంశాలపై చర్చ 9/14

పలు విండ్‌, సోలార్‌, హైబ్రిడ్‌ ప్రాజెక్టులకు ఆమోదంపై కేబినెట్‌ పరిశీలించనుంది. 1,344 మెగావాట్ల/10,752 మెగావాట్‌ అవర్‌ పంప్‌డ్ స్టోరేజ్‌ కొనుగోలుకు కేబినెట్ ప్రతిపాదనలు చేయనుంది.

ఏపీ కేబినెట్ భేటీ.. 60కు పైగా అజెండా అంశాలపై చర్చ 10/14

రాష్ట్రంలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటుకు ప్రతిపాదన చేయనుంది. రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలులో కొత్త పోలీస్‌ కమిషనరేట్లకు మంత్రి మండలి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది.

ఏపీ కేబినెట్ భేటీ.. 60కు పైగా అజెండా అంశాలపై చర్చ 11/14

పలు ఐటీ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనుంది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పాలసీ కింద ఏడు సంస్థలకు ప్రోత్సాహకాల ప్రతిపాదనలను చేయనుంది.

ఏపీ కేబినెట్ భేటీ.. 60కు పైగా అజెండా అంశాలపై చర్చ 12/14

అమరావతి, కడప, రేణిగుంటలో హోటల్‌ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనుంది. న్యాయాధికారుల పదవీ విరమణ వయసు 61 నుంచి 62 ఏళ్లకు పెంపుపై కేబినెట్ పరిశీలించనుంది.

ఏపీ కేబినెట్ భేటీ.. 60కు పైగా అజెండా అంశాలపై చర్చ 13/14

ఆంధ్రప్రదేశ్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ పాలసీకి కేబినెట్‌ ప్రతిపాదన చేయనుంది. ఆహార ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్స్‌, స్టీల్‌, సిమెంట్‌ రంగాలపై మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

ఏపీ కేబినెట్ భేటీ.. 60కు పైగా అజెండా అంశాలపై చర్చ 14/14

సాగునీటి ప్రాజెక్టులు, పట్టణ భూసేకరణ, ప్రభుత్వ భూముల కేటాయింపులపై నిర్ణయాలపై కేబినెట్ చర్చించనుంది. ఎక్సైజ్‌ పాలసీ, వార్డు సచివాలయాల్లో పదోన్నతి మార్గాలపై మంత్రి మండలి పరిశీలించనుంది.

Updated at - Sep 23 , 2026 | 02:16 PM