కడప జిల్లాలో జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించిన చంద్రబాబు, పవన్

ABN, Publish Date - Oct 05 , 2026 | 08:40 PM

కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు (సోమవారం) పర్యటించారు. ప్రొద్దుటూరులో ఏపీ వ్యాప్తంగా రూ.30.15 కోట్ల వ్యయంతో చేపట్టిన జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించారు.

కడప జిల్లాలో జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించిన చంద్రబాబు, పవన్ 1/15

కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు(సోమవారం) పర్యటించారు.

కడప జిల్లాలో జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించిన చంద్రబాబు, పవన్ 2/15

ప్రొద్దుటూరులో ఏపీ వ్యాప్తంగా రూ.30.15 కోట్ల వ్యయంతో చేపట్టిన జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించారు.

కడప జిల్లాలో జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించిన చంద్రబాబు, పవన్ 3/15

పల్లెల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.

కడప జిల్లాలో జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించిన చంద్రబాబు, పవన్ 4/15

ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తామని ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

కడప జిల్లాలో జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించిన చంద్రబాబు, పవన్ 5/15

ఈ హామీ మేరకు ఇంటింటికీ తాగునీరు అందించే కార్యక్రమానికి ఇవాళ ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

కడప జిల్లాలో జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించిన చంద్రబాబు, పవన్ 6/15

రూ.30,156 కోట్లతో ప్రొద్దుటూరు నుంచి జల్ జీవన్ మిషన్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు.

కడప జిల్లాలో జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించిన చంద్రబాబు, పవన్ 7/15

ఏపీలోని 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కుళాయి కనెక్షన్లను కూటమి సర్కార్ అందించనుంది. ఈ సందర్భంగా కొత్తపల్లిలో పైలాన్‌ను ఆవిష్కరించారు.

కడప జిల్లాలో జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించిన చంద్రబాబు, పవన్ 8/15

గోదావరి - కావేరి నదుల అనుసంధానం తన కోరిక అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. కరవు సమయంలోనూ 2వేల టీఎంసీలు సముద్రం పాలయ్యాయని అన్నారు. నదుల అనుసంధానంతో 4 రాష్ట్రాలకు సాగునీటి కష్టాలు పరిష్కారమవుతాయని తెలిపారు.

కడప జిల్లాలో జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించిన చంద్రబాబు, పవన్ 9/15

ఏపీలో ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి తెలిపారు. కర్మయోగి ద్వారా ప్రతి ఉద్యోగిలో నైపుణ్యం పెంచుతామని వెల్లడించారు.

కడప జిల్లాలో జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించిన చంద్రబాబు, పవన్ 10/15

గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ 3.0ను చేపట్టామని సీఎం అన్నారు. మదనపల్లె హార్టికల్చర్ హబ్‌తో రాయలసీమ దశ-దిశ మారబోతోందని తెలిపారు.

కడప జిల్లాలో జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించిన చంద్రబాబు, పవన్ 11/15

కూటమి ప్రభుత్వంలో జల్‌జీవన్‌ పథకాన్ని మళ్లీ పొడిగించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోలేదని ధ్వజమెత్తారు.

కడప జిల్లాలో జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించిన చంద్రబాబు, పవన్ 12/15

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దని పవన్ కల్యాణ్ చెప్పారు. యుద్ధం వచ్చినప్పుడే కదా మాట్లాడాల్సిందని పేర్కొన్నారు.

కడప జిల్లాలో జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించిన చంద్రబాబు, పవన్ 13/15

కేంద్రం సహకారంతో గతంలో లేని విధంగా ఏపీలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం వివరించారు.

కడప జిల్లాలో జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించిన చంద్రబాబు, పవన్ 14/15

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.6 వేల కోట్లతో పనులు చేపట్టామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

కడప జిల్లాలో జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను ప్రారంభించిన చంద్రబాబు, పవన్ 15/15

వైసీపీ హయాంలో ఏ ప్రాజెక్టును సరిగా పూర్తిచేయలేదని పవన్‌ కల్యాణ్ విమర్శించారు.

Updated at - Oct 05 , 2026 | 09:33 PM