Share News

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువకుడి మృతి

ABN , Publish Date - Nov 21 , 2026 | 11:15 AM

ఈరోజు (శనివారం) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు మరణించాడు. వారం క్రితమే ఉద్యోగం సాధించిన అతడు.. ఇప్పుడు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువకుడి మృతి

ఇంటర్నెట్ డెస్క్: ఈరోజు (శనివారం) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు యువకుడు మరణించాడు. వారం క్రితమే ఉద్యోగం సాధించిన అతడు.. ఇప్పుడు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. నల్గొండ జిల్లాలోని మునుగోడుకు చెందిన ఈరమళ్ల ప్రసాద్, శ్రీకన్య దంపతుల కుమారుడు సాయితేజ(25) ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ప్రయత్నించగా.. వారం క్రితమే ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో సాయితేజ కారులో ప్రయాణిస్తుండగా ఓ జింక అడ్డు వచ్చింది. దీంతో అతడు ఒక్కసారిగా కారు ఆపగా .. వెనుక నుంచి సరకు రవాణా వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో సాయితేజ అక్కడికక్కడే మృతి చెందాడు.


సాయితేజ మరణంతో మునుగోడులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం రాత్రికి అతడి మృతదేహం భారత్‌కు వచ్చే అవకాశాలున్నాయి. కాగా ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హెలికాప్టర్‌లో సహాయంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు.


ఈ వార్తలూ చదవండి

మత్స్యకారుల సంక్షేమం.. ఆక్వా రంగ అభివృద్ధే ఏపీ ప్రగతి: చంద్రబాబు

భారత్ తొలి బుల్లెట్ రైలుకు ముహూర్తం ఫిక్స్.. 2027 నుంచి అందుబాటులోకి బీ28

Updated Date - Nov 21 , 2026 | 11:46 AM